Horoscope Today Feb 18 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి తోబుట్టువుల నుంచి శుభవార్త

Horoscope Today  Feb 18 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రతికూల సమయం. అదే సమయంలో మరికొన్ని రాశుల వారికి ఈ రెండు రంగాల్లో కలిసిరావొచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 08:04 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ ప్రతికూల సమయం
  • ఆ రాశి వారికి తోబుట్టువుల నుంచి గుడ్ న్యూస్ అందే ఛాన్స్
  • ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి జాబ్ దొరికే ఛాన్స్
Horoscope Today Feb 18 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి తోబుట్టువుల నుంచి శుభవార్త

Horoscope Today Feb 18 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ అంతగా కలిసిరాకపోవచ్చు. అలా అని ఆత్మన్యూనత భావానికి గురికావొద్దు. పెద్దల సలహాలతో కఠిన పరిస్థితులను అధిగమించాలి. కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇవాళ పూర్తి సానుకూల సమయమని చెప్పవచ్చు. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.

మేషరాశి ( Aries) 

ఇవాళ మీకు అంతగా కలిసిరాకపోవచ్చు. జీవితాన్ని ఒక భారంగా ఎప్పుడూ భావించకండి. పరిస్థితుల నుంచి తప్పించుకోవడం కంటే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడండి. పెద్దల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించండి. ఆత్మన్యూనత భావాన్ని విడనాడి ముందుకు సాగండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నష్టాలు చవిచూసినా ఆత్మవిశ్వాసం సడలిపోకుండా జాగ్రత్తపడండి.

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీరు పూర్తి చేయాల్సిన పనులు అసంపూర్తిగానే మిగిలిపోతాయి. మూడ్ స్వింగ్స్ మిమ్మల్ని ఇబ్బందిపెడుతాయి. కొన్ని సందర్భాలు మీ సహనానికి ఒక పరీక్షలా నిలుస్తాయి. చిన్న చిన్న తప్పిదాలు మీరు చేసే పనులను మరింత గందరగోళంలోకి నెట్టుతాయి. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను వ్యక్తీకరించడంలో కొంత కన్ఫ్యూజన్‌కి గురవుతారు. జీవిత భాగస్వామిపై ఎనలేని అంచనాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి.

మిథున రాశి (GEMINI)

ఇవాళ మీకు పూర్తి అనుకూల సమయం. పెండింగ్ పనులను కొలిగ్స్ సహాయంతో పూర్తి చేస్తారు. మీ నెట్‌వర్క్ మరింత విస్తృతమవుతుంది. భవిష్యత్తులో మీరు చేయబోయే పనులకు ఆ నెట్‌వర్క్ ఉపయోగపడుతుంది. తోబుట్టువులు లేదా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం. ఇరుగుపొరుగు వారితో వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు బద్దకాన్ని అధిగమిస్తే మంచి ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి (Cancer) 

కుటుంబ సంబంధిత విషయాల్లో ఇవాళ డబ్బు ఖర్చు చేస్తారు. ఇది ఆర్థికంగా మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేస్తోంది. ఇప్పటినుంచి ఆర్థికపరమైన క్రమశిక్షణ అలవరుచుకోండి. అనవసర వృథా ఖర్చులకు దూరంగా ఉండండి. ఏ పనికైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకోండి. ముక్కుసూటితనాన్ని నియంత్రణలో పెట్టుకోండి. తద్వారా వ్యక్తిగత, ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది.

సింహ రాశి (LEO)

ఇవాళ మీకు పూర్తి అనుకూల సమయం. తోబుట్టువుల నుంచి శుభవార్త అందే అవకాశం. ఆ వార్త మిమ్మల్ని ఒక పాజిటివ్ వాతావరణంలోకి తీసుకెళ్తుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి మంచి జాబ్ దొరికే అవకాశం. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం వల్ల మీ నిర్ణయాత్మక శక్తి మరింత బలపడుతుంది. అకడమిక్ పరంగా విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి.

కన్య రాశి (Virgo)

ఇవాళ మీ మూడ్ అంతగా బాగుండకపోవచ్చు. ఆరోగ్యం కొంత ఇబ్బందిపెడుతుంది. కొన్ని విషయాల్లో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతారు.కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఒకసారి మీ అంతర్ దృష్టితో ఆలోచించండి. అడ్వెంచర్ టూరిజంకు దూరంగా ఉండండి. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఆత్మన్యూనత భావం విడనాడితే మంచిది.

తులా రాశి (Libra)

ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టనప్పటికీ వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. గతంలో మీరు చవిచూసిన నష్టాలు ఇప్పుడు భర్తీ అవుతాయి. అకడమిక్ రంగంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. స్వచ్చంద సంస్థలు లేదా మతపరమైన సంస్థలకు కొంత డబ్బును విరాళంగా ఇస్తారు. పెట్టుబడులకు ఇది అనువైన సమయం. విద్యార్థులకు అన్ని విధాలుగా కలిసొస్తుంది.

వృశ్చిక రాశి (Scorpio)

వృత్తిపరంగా మీ పెర్ఫామెన్స్‌కి ప్రశంసలు దక్కుతాయి. మీ బాస్, సీనియర్ల నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగ మార్పు ఉండవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి తగిన జాబ్ దొరికే అవకాశం. సింగిల్స్‌కు మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం. 

ధనుస్సు రాశి (Sagittarius)  

ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించుకోగలరు. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించే అవకాశం. ఏదేని పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం. స్వచ్చంద సంస్థలు లేదా మతపరమైన సంస్థలకు కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తారు. షార్ట్ బిజినెస్ ట్రిప్‌కి ప్లాన్ చేసే అవకాశం. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. ప్రేమలో ఉన్నవారికి పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.

మకర రాశి (Capricorn) 

ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. దాంతో కొన్ని పనులు పెండింగ్‌లో పడిపోతాయి. మీలోని నెగటివిటీస్‌ను గుర్తించి వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు పది మందిలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఫీల్ అవుతారు. చేస్తున్న పనిపై దృష్టి సారించలేకపోతారు. పెద్దల సలహాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు.

కుంభ రాశి (Aquarius)

వ్యాపారంలో ఉన్నవారికి అన్ని విధాలా కలిసొస్తుంది. కొత్త ఆర్డర్స్ ప్రాఫిట్స్‌ను తీసుకొస్తాయి. కొత్త స్ట్రాటజీస్‌తో ముందుకెళ్లడం లాభిస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వాములు వచ్చి చేరుతారు. పని ఒత్తిడితో మానసికంగా కొంత అలసటకు గురవుతారు. అది మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది.

మీన రాశి (Pisces) 

ఉద్యోగంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. కొలిగ్స్ సహాయ సహకారాలు లభిస్తాయి. మీ పెర్ఫామెన్స్ బాగుంటుంది. గతంలో వాయిదా వేయబడ్డ పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. పెట్టుబడుల కోసం కొంత డబ్బును అప్పుగా తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి గుడ్ న్యూస్ అందుతుంది. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు.

Also Read: Phalguna Masam: ఫాల్గుణ మాసం వచ్చేసింది.. ఈ మాసంలో ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News