Horoscope Today Feb 17 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ముక్కు సూటితనం పనికిరాదు..

Horoscope Today  Feb 17 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారిని అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతాయి. ప్రతికూలతల నడుమ కొన్ని పనులు పూర్తి చేయలేకపోతారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 08:31 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ కలిసొస్తుంది
  • ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆ రాశుల వారికి మంచి ఫలితాలు
  • కొన్ని రాశుల వారిని ప్రతికూల ఫలితాలు వెంటాడుతాయి
 Horoscope Today Feb 17 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ముక్కు సూటితనం పనికిరాదు..

Horoscope Today Feb 17 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... ఇవాళ కొన్ని రాశుల వారికి పూర్తి అనుకూల సమయం కాగా, మరికొన్ని రాశుల వారికి పూర్తిగా ప్రతికూల సమయం. కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కలిసొస్తుంది. అదే సమయంలో ప్రతికూలత కారణంగా కొన్ని రాశుల వారు నష్టాలు చవిచూస్తారు.

మేషరాశి ( Aries) 

ఇవాళ మీకు పూర్తి అనుకూల సమయం. కొన్ని ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అన్ని పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఎదురుచూస్తున్న అవకాశం ఒకటి మీ తలుపు తట్టవచ్చు. రెండో ఆలోచన లేకుండా మీరు దాన్ని ఒడిసిపట్టుకునే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి స్నేహితుల ద్వారా మంచి అవకాశం వచ్చే అవకాశం. కుటుంబం, బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు.

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీరు నిరుత్సాహంగా ఉండే అవకాశం. అహంకారం కారణంగా మిమ్మల్ని కొన్ని ఇబ్బందులు వెంటాడుతాయి. అది వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపై ప్రభావం చూపిస్తుంది. ఆత్మన్యూనత భావం వెంటాడుతుంది. తద్వారా మీ పనిలో సృజనాత్మకతను కోల్పోతారు. అనవసర వివాదాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది.

మిథున రాశి (GEMINI)

ఇవాళ మీకు ముక్కుసూటితనం పనికిరాదు. దాన్ని నియంత్రణలో పెట్టుకోవడం ఉత్తమం. అలాగే నోటికొచ్చినట్లు మాట్లాడటం మానేయండి. అది మీ సన్నిహితులను నొచ్చుకునేలా చేస్తుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసర వాటికి డబ్బులు వెచ్చిస్తారు. ఏ నిర్ణయమైనా సరే ఆచీ తూచీ కాస్త ఓపికగా ఆలోచించి తీసుకోండి.

కర్కాటక రాశి (Cancer) 

త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కఠినాత్మక విషయాల్లో మీ నిర్ణయాలకు మీ సహచరుల నుంచి సలహాలు, సూచనలు అందుతాయి. కాస్త సంయమనంతో ముందడుగు వేస్తే విజయం మీ సొంతమే. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. త్వరలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసే అవకాశం. 

సింహ రాశి (LEO)

కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. ఇంట్లో పెద్దల నుంచి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచీ తూచీ నిర్ణయం తీసుకోవాలి. కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. సకాలంలో పనులు పూర్తి కాకపోవడం మిమ్మల్ని ఇబ్బందిపెట్టవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు.

కన్య రాశి (Virgo)

ఇవాళ మీకు కొంత ప్రతికూల సమయం. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ ఇబ్బందిపెట్టే అవకాశం. ఓపికతో వ్యవహరించకపోవడం వల్ల కొన్ని హడావిడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బందుల్లో పడుతారు. ఏ నిర్ణయమైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే ముందడుగు వేయండి. డబ్బును వృథాగా ఖర్చు పెట్టకండి.

తులా రాశి (Libra)

మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారంలో మరికొంత పెట్టుబడులు పెడుతారు. తద్వారా మున్ముందు మంచి ఆర్థిక ఫలితాలు పొందుతారు. భార్యతో రొమాంటిక్‌గా గడుపుతారు. వ్యక్తిగత, వ్యాపార జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. సింగిల్స్‌కి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం. ప్రేమికులు పెళ్లి నిర్ణయం తీసుకునేందుకు అనువైన సమయం. విద్యార్థులకు కలిసొస్తుంది.

వృశ్చిక రాశి (Scorpio)

ఇవాళ మీరు చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగానికి సంబంధించి కొన్ని మార్పులు జరుగుతాయి. మీ ప్రత్యర్థులు, శత్రువులు మీ జోలికి రారు. సింగిల్స్, ప్రేమికులు పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.

ధనుస్సు రాశి (Sagittarius)  

గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఇందుకోసం మీ కొలిగ్స్ లేదా వ్యాపార భాగస్వాముల సహాయం తీసుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు.

మకర రాశి (Capricorn) 

ఇవాళ మీకు అంత సానుకూలంగా ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందిపెడుతాయి. వ్యాపారంలో పెట్టుబడులను వాయిదా వేయడం ఉత్తమం. ఇప్పుడప్పుడే కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టకండి. వ్యాపార రంగంలో నష్టాలు చవిచూసే అవకాశం. కీలక నిర్ణయాల్లో సన్నిహితుల సలహాలు తీసుకోండి.

కుంభ రాశి (Aquarius)

వృత్తిపరంగా త్వరిగతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు తలుపు తెరుచుకుంటాయి. తద్వారా మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మీ వ్యాపార భాగస్వామి సహాయంతో కొత్త ఇన్నోవేషన్స్‌తో ముందుకెళ్తారు. భవిష్యత్తులో అది మీ వ్యాపారాన్ని మరింత పుంజుకునేలా చేస్తుంది.

మీన రాశి (Pisces) 

ఇవాళ మీకు పూర్తిగా అనుకూల సమయం. ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ ఉండొచ్చు. ఆఫీసులో మీ బాస్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న జాబ్ నుంచి వేరే ఉద్యోగానికి మారే ప్రయత్నాలు చేయవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు.

Also Read: పెళ్లింట ఊహించని విషాదం... ప్రమాదవశాత్తు బావిలో పడి 13 మంది మృతి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News