Horoscope Today Feb 12 2022: రాశి ఫలాలు.. కెరీర్ పరంగా ఆ రాశి వారికి ఇవాళ గుడ్ న్యూస్..

Horoscope Today  Feb 12 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి వృత్తిపరమైన, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. కొన్ని రాశుల వారికి కొన్ని విషయాల్లో గుడ్ న్యూస్ అందుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 11:51 AM IST
  • ఇవాళ కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు
  • కొన్ని రాశుల వారికి ఉద్యోగ పరంగా గుడ్ న్యూస్ అందే ఛాన్స్
  • ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు సఫలమవుతారు
 Horoscope Today Feb 12 2022: రాశి ఫలాలు.. కెరీర్ పరంగా ఆ రాశి వారికి ఇవాళ గుడ్ న్యూస్..

Horoscope Today Feb 12 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కొన్ని రాశులవారికి ఇవాళ శుభవార్త అందే అవకాశం ఉంది. అలాగే ప్రేమ జంటలు పెళ్లి చేసుకునేందుకు ఇది అనువైన సమయం. అయితే వారికి కాస్త సహనం అవసరం. క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అందుతాయి.

మేషరాశి ( Aries) 

సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. మీ క్రియేటివిటీ పీక్స్‌కి చేరుతుంది. తద్వారా మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. బహుశా అవార్డులు కూడా పొందవచ్చు. మీ గురించి ఇతరులు గొప్పగా చెబుతారు. ఇవాళ కొన్ని ముఖ్యమైన గృహోపకరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అన్నాదమ్ములతో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం.

వృషభ రాశి (Taurus)

ఈరోజు మీ కెరీర్‌కు సంబంధించిన శుభవార్త అందుతుంది. మీరు ప్రమోషన్ కోసం చూస్తున్నట్లయితే.. మీకు గుడ్ న్యూస్ అందే ఛాన్స్ ఉంది. మీ పనికి ఉన్నతాధికారుల నుంచి తగిన గుర్తింపు లభిస్తుంది. సేవింగ్స్ పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ప్రేమలో ఉన్నవారు వివాహానికి ప్లాన్ చేసుకోవడానికి అనువైన సమయం. 

మిథున రాశి (GEMINI)

ఇతరులు వినడాన్ని అభినందిస్తున్నారని చెప్పడానికి మీకు ఆసక్తికరమైన వార్తలు ఉండవచ్చు. మీ సాధారణ పరిసరాల్లో కొన్ని మార్పులు రావచ్చు. బహుశా కొత్త పొరుగువారు లేదా సంస్థలు తరలిపోతున్నాయి లేదా సామాజిక వ్యవహారం ఏర్పాటు చేయబడి ఉండవచ్చు. ఇది ఆక్రమించబడినప్పటికీ నెరవేరే రోజుగా ప్రతిజ్ఞ చేస్తుంది. ఓవర్‌సీస్ ట్రిప్. వ్యాపారం పురోగతి. దీర్ఘకాలిక వ్యాధి నయమయ్యే.

కర్కాటక రాశి (Cancer) 

ఆఫీస్‌లో వ్రాతపనితో మునిగిపోతారు. ఈరోజు మీకు పూర్తిగా అనుకూల సమయం. కాబట్టి ఈ రోజు చేయవలసిన ఉత్తమమైన పని ఏమిటంటే, అన్ని పనులను పక్కన పెట్టి వృత్తిపరమైన వ్యవహారాలను చక్కదిద్దుకోవడం. ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. వృత్తిపరమైన పనిలో బిజీగా ఉండటం వల్ల కుటుంబానికి తగిన సమయం వెచ్చించకపోవచ్చు.

సింహ రాశి (LEO)

మీరు మీ కెరీర్‌ మార్పు గురించి ఆలోచిస్తున్నారా? అయితే, వద్దు. ఇప్పుడప్పుడే కెరీర్ మార్పుపై దృష్టి పెట్టకండి. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్ అందే అవకాశం. స్నేహితుల సాయంతో అనుకున్న జాబ్ దొరికే అవకాశం ఉంది.

కన్య రాశి (Virgo)

మీ పరిచయాలు, స్నేహాలు కలిసొస్తాయి. ఇతరుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటారు. స్కిల్స్ మరింత మెరుగవుతాయి. ఇది ఇతరులపై మీరు పైచేయి సాధించేలా చేస్తుంది. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతాయి. దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి.. అంతా కలిసి పార్టీ చేసుకునే అవకాశం ఉంది.

తులా రాశి (Libra)

లక్ష్యాలను చేరుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శత్రువులను ఓ కంట కనిపెట్టండి.రాష్ డ్రైవింగ్‌కి దూరంగా ఉండండి. ప్రేమికులకు ఓపిక అవసరం. చాలాకాలంగా పూర్తి చేయాలనుకుంటున్న పని ఒకటి పూర్తవుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి (Scorpio)

ప్రస్తుతం మీరు కొనసాగుతున్న ఫీల్డ్‌ మంచి పురోగతి సాధిస్తారు. చాలాకాలం క్రితం పెట్టిన పెట్టుబడి ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటారు. తప్పులు తెలుసుకుంటారు. తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. పెళ్లి కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి జోడి దొరికే అవకాశం. విద్యార్థులకు అనుకూల సమయం.

ధనుస్సు రాశి (Sagittarius)  

ఆఫీసులో మీ పనికి తగిన గుర్తింపు పొందుతారు. మీ పనికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆపదలో ఉన్న ఒకరికి ఆర్థిక సాయం చేస్తారు. పెద్దల మద్దతు లభిస్తుంది. ప్రమోషన్ల కోసం చూస్తున్నవారికి శుభవార్త అందే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికతపై దృష్టి సారించవచ్చు.

మకర రాశి (Capricorn) 

వ్యాపారంలో మీ పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. ప్రేమికులు పెళ్లి చేసుకునేందుకు అనువైన సమయం.ఉద్యోగం కోసం చూస్తున్నవారికి శుభవార్త అందుతుంది.మీ కెరీర్‌కు సంబంధించి మీకు పాజిటివ్ ఫోన్ కాల్ రావొచ్చు. ఆ ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చవచ్చు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. దూకుడు తగ్గించుకుంటే మంచిది.

కుంభ రాశి (Aquarius)

ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. మంచి జాబ్ ఆఫర్ రావొచ్చు. దంపతులు శుభవార్త వింటారు. కుటుంబంతో విహారయాత్రకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. అలాగే కొత్తగా పనులు మొదలు పెట్టాలనుకునేవారికి అనువైన సమయం. అనవసర వివాదాల జోలికి వెళ్లకండి.

మీన రాశి (Pisces) 

మీ స్కిల్స్ మిమ్మల్ని ఇతరులకు మరింత చేరువ చేస్తాయి. ఇతరులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేయాల్సిన ప్రెజెంటేషన్‌లు, ఇంటర్వ్యూలలో రాణిస్తారు. కొంత నిరాశజనకంగా ఉన్నప్పటికీ సహనంతో ముందుకెళ్లాలి. లక్ష్యంపై ఫోకస్ చేయలేని పరిస్థితులు ఏర్పడినా.. ఆత్మవిశ్వాసాన్ని పునికిపుచ్చుకోవాలి. పెట్టుబడి ప్లాన్స్ వాయిదా వేయండి. 

Also Read: Teenmar Mallanna Interview: రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నానంటున్న తీన్మార్ మల్లన్నతో బిగ్ డిబేట్ విత్ భరత్

Also read : Telugu Movies on OTT: ఈ వారం ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతోన్న మూవీలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News