Horoscope Today August 5th 2022: ఇవాళ శుక్రవారం. లక్ష్మీ దేవికి అంకితం చేయబడిన రోజు. ఈ శ్రావణ మాస శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం కూడా కావడం విశేషం. మరి ఈ శుక్రవారం రాశిచక్రంలోని ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం
మేష రాశి (Aries)
ప్రభావశీలురైన కొందరు వ్యక్తుల సలహాలు, సూచనలు మీ బిజినెస్‌కు ఉపయోగపడుతాయి. లక్ష్యాలను చేరుకోవడంలో వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వారి పనితనాన్నిఅధికారులు అభినందిస్తారు. టార్గెట్ సంబంధిత పనులు చేసేవారిపై ఒత్తిడి అధికమవుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతారు.
వృషభ రాశి (Taurus)
ఉద్యోగ, వ్యాపారస్తులకు శుభదినం. చాలాకాలంగా ఇతరుల వద్ద నిలిచిపోయిన మీ డబ్బు ఎట్టకేలకు అందుతుంది. వ్యాపారస్తులకు ఇవాళ కీలక డీల్ ఒకటి ఖరారయ్యే అవకాశం ఉంది. లగ్జరీ వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేస్తారు. విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు మీ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుస్తాయి. మీ చుట్టూ ఉండే నెగటివ్ మనుషులను లైట్ తీసుకోండి. ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోండి.
మిథున రాశి (GEMINI)
కొన్ని సమస్యలపై ఒక సమూహం తరుపున గొంతెత్తుతారు. పని ప్రదేశంలో సహచర ఉద్యోగి అయిన ఒకరి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది. వారితో ఓపికగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోగలరు. ఇంట్లో తల్లిదండ్రులతోనూ వివాదాలు తలెత్తవచ్చు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఇప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది.మీ పిల్లల భవిష్యత్తుకై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అబద్దాలు చెప్పడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. ఇతరులు మీ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తపడండి.
కర్కాటక రాశి (Cancer)
రిలేషన్షిప్లో ఉన్నవారు తమ భాగస్వామితో మోసపోయే అవకాశం ఉంది. పెళ్లయిన జంటలు శుభవార్త వింటారు లేదా జీవితభాగస్వామి నుంచి బహుమతులు పొందుతారు. ఏ విషయమైనా ఓపికగా వినే అలవాటు చేసుకోండి.తొందరపడి విషయం మొత్తం తెలియకుండానే ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కొన్ని ముఖ్య విషయాల్లో సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో అర్థవంతమైన చర్చలు మీకు కలిసొస్తాయి. మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తాయి.
సింహ రాశి (LEO)
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.పొట్ట సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. రాత్రిపూట త్వరగా పడుకోవడం, ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. వీలైనంతవరకు ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేయవద్దు. కుటుంబ సభ్యుల సహాయ,సహకారాలు లభిస్తాయి. మీ ఆరోగ్యం కోసం వారు ఆరాటపడుతుంటారు.
కన్య రాశి (Virgo)
వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. వ్యాపారస్తుల లక్ష్యాలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు తమ పనితీరుతో విశేషమైన గుర్తింపు పొందుతారు. ఆఫీసులో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రైవేట్ జాబ్స్ చేసేవారు మరో రంగంలోకి మారే ఆలోచనలో ఉంటారు. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవారు సక్సెస్ అందుకుంటారు.
తులా రాశి (Libra)
ఆర్థికపరమైన ప్రణాళికలు, వ్యూహాలు సక్సెస్ అవుతాయి. ఇవాళ పెట్టే పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం చేసేవారికి అన్నివిధాలా కలిసొస్తుంది. డబ్బును అప్పుగా ఎవరికీ ఇవ్వొద్దు. మీ నుంచి తీసుకున్న అప్పు చాలాకాలం పాటు మళ్లీ వసూలు అవదు. మీ అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లి సంబంధాలకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. తెలిసినవారితో వాకబు చేస్తారు.
వృశ్చిక రాశి (Scorpio)
కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామి ఆఫీస్ పని రీత్యా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఆఫీస్ పని విషయంలో ఆసక్తి సన్నగిల్లుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఉన్నత విద్య విషయంలో గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది. మీ ఇంటి అలంకరణకు డబ్బును, సమయాన్ని వెచ్చిస్తారు. చిన్నపిల్లల ఫుడ్ హ్యాబిట్స్ పట్ల కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మునుపటికన్నా మెరుగవుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. చిన్న చిన్న విభేదాలే భార్యాభర్తల మధ్య గ్యాప్‌కు కారణమవుతాయి. ఓపికలేని తనం, ఒకరి మాట ఒకరు వినకపోవడం సమస్యను పెద్దది చేస్తుంది. పెద్దల ప్రమేయాన్ని కోరే అవకాశం ఉంది. ప్రేమికులు తమ ప్రియురాలు లేదా ప్రియుడి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొస్తారు. త్వరగా పెళ్లి చేసుకుందామని కోరుతారు.
మకర రాశి (Capricorn)
అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ఇవాళంతా హుషారుగా ఉంటారు. వృద్ధులు సైతం ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు మీకు పడకపోవచ్చు. వాటిని తీసుకోకపోవడమే బెటర్. మీ తోబుట్టువులు ఇవాళ మీ ఇంటికొచ్చే అవకాశం ఉంది. అంతా కలిసి సంతోష సమయాన్ని గడుపుతారు. మీ పెద్దలు మీ ఎదుగుదలకు సంతోషిస్తారు.
కుంభ రాశి (Aquarius)
ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఇతరులు మీ నుంచి డబ్బు ఆశించవచ్చు. ధన దానం విషయంలో పెద్దల సలహా తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మరికొంత కాలం ఎదురుచూపులు తప్పవు. రీసెర్చ్ సంబంధిత పనులు చేసేవారికి కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. మహిళలు కొత్త పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులకు కొలిగ్స్ నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
మీన రాశి (Pisces)
ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. పెరిగిపోయిన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టుతాయి. డబ్బుల కోసం రిస్క్‌తో కూడుకున్న పనులు చేయకండి. ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు కొంత సమయం పడుతుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉండొచ్చు. వ్యాపార కార్యకలాపాల్లో వృద్ధి కనిపిస్తుంది. కుటుంబ సంబంధాలు మరింత బలపడుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: MP Gorantla Madhav Live Updates: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో లీక్.. పార్లమెంట్ లో రచ్చ
Also Read: Comedian Raghu's father death: జబర్ధస్త్ కమెడియన్ రఘు తండ్రి మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook