Horoscope Today April 21 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు..

Horoscope Today  April 21 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ పలు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి కొన్ని విషయాల్లో కలిసొస్తే.. మరికొన్ని విషయాల్లో అంతగా కలిసిరాకపోవచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 07:30 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు
  • కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసిరాదు
  • కొన్ని రాశుల వారు కీలక నిర్ణయాల్లో ఇతరుల సూచనలు స్వీకరించాలి
Horoscope Today April 21 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు..

Horoscope Today April 21 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... వృత్తిపరమైన, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. కొన్ని రాశుల వారు చేపట్టిన పనుల్లో వేగవంతమైన పురోగతి ఉండటమే కాదు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

మేషరాశి ( Aries) 

వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి మీ కొలిగ్స్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఇది అనువైన రోజు. మీ ముందు చూపు జీవితంలో మీ ఎదుగుదలకు దోహదం చేస్తుంది. ఇతరులకు మీరెంతగా సాయపడుతారో... ఆ సహాయం భవిష్యత్తులో మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీ తెలివి తేటలు సమాజంలో పలుకుబడిని ఏర్పరుస్తాయి. మీ ఛరిష్మా కారణంగా మిమ్మల్ని చాలా మంది అభిమానిస్తారు.

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీరు మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మీ లక్ష్యాలపై ఫోకస్ చేసినన్ని రోజులు మీరు అనుకున్న ఎజెండాను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వెళ్తారు. సమయం విలువని గ్రహించి మెదిలితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. చురుకుదనం, తెలివితేటలు, జ్ఞాపకశక్తి కారణంగా చేపట్టిన పనుల్లో నిత్య పురోగతి ఉంటుంది.

మిథున రాశి (GEMINI)

వృత్తిపరమైన ప్రయాణాలు చేస్తారు. గతాన్ని తలుచుకుని విచారించాల్సి పని లేదు. సాధ్యం కాని లక్ష్యాలను ఏర్పరుచుకున్నామని చింతిస్తారు. కానీ అది నిజం  కాదు. ఎప్పుడూ ఏకాభిప్రాయం సాధ్యం కాని వ్యక్తుల మధ్య ఇవాళ మీరిచ్చే సలహా లేదా సూచన అందరినీ ఒక్క తాటి పైకి తీసుకొస్తుంది. వృత్తిపరంగా వివిధ టీమ్స్ మధ్య సమన్వయకర్తగా కీలక పాత్ర పోషిస్తారు.

కర్కాటక రాశి (Cancer) 

మీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. అయితే కొంత సంయమనం, ఓపిక అవసరం. మీ అద్భుతమైన సలహాలు లేదా సూచనలను మీ బాస్ గుర్తించడానికి కొంత సమయం పట్టవచ్చు. అసహన పనికిరాదు. మీ పనిని పూర్తి చేసేందుకు ఇతరులపై ఒత్తిడి పెట్టవద్దు. మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకునేలా ఇతరులను ఒప్పించడానికి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. కొత్త పరిచయాలతో సామాజికంగా మీ పరిచయాలు, పలుకుబడి మరింత పెరుగుతుంది.

సింహ రాశి (LEO)

ఇవాళ మీ సహోద్యోగులతో కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. మీకు మార్గనిర్దేశం చేయడానికి పరిణతి చెందిన ఓ వ్యక్తి నుంచి సలహా స్వీకరించండి. భావోద్వేగ పరిస్థితులను మీ అవసరాలకు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నం మంచిది కాదు. కొత్త పరిచయస్తులను తక్కువగా అంచనా వేయకండి. దీర్ఘకాలిక లక్ష్యాలపై ఎక్కువ ఫోకస్ పెడితే మంచి ఫలితాలు ఉంటాయి.

కన్య రాశి (Virgo)

కొత్త ప్రాజెక్టులు మొదలుపెడుతారు. స్పెషల్ గిఫ్ట్ కొనుగోలు చేసేందుకు అనువైన రోజు.  పని భారం మీ ఆరోగ్యంపై కొంత ప్రభావంచూపుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోండి. ఆర్థిక పురోగతికి అవసరమయ్యే ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించుకోండి. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభాలు తీసుకొస్తాయి.

తులా రాశి (Libra)

ఇవాళ మీకు అన్ని విధాలా కలిసొస్తుంది. మీరు చేపట్టిన ప్రతీ పని సక్సెస్ అవుతుంది. విదేశాల నుంచి మీకు శుభవార్త అందే అవకాశం ఉంది. కొత్తగా ఆలోచించే మీ తత్వం సమస్యలకు పరిష్కారం చూపుతుంది. కొత్త పరిచయాలు కలిసొస్తాయి. అకడమిక్‌ రంగంలో ఉన్నవారు కొత్త విద్యావకాశాలపై దృష్టి సారిస్తారు. మీ ఆలోచనలు అమలులో పెట్టేందుకు మీ తోటివారి సాయం తీసుకోండి.

వృశ్చిక రాశి (Scorpio)

మీ ప్రొఫెషనల్ రంగంలో కొన్ని అడ్జస్ట్‌మెంట్స్‌కి ఇది కీలకమైన రోజు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్తే వ్యాపార రంగంలో, వృత్తిపరంగా బాగా రాణించగలరు. ఇప్పుడు మీరు చేస్తున్న కృషిని బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తించండి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 

ధనుస్సు రాశి (Sagittarius)  

మిమ్మల్ని తగ్గించాలని చూసే వ్యక్తులకు దగ్గరగా ఉండకపోవడం మంచిది. చిన్న చిన్న సమస్యలకు కూడా ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి లోను కావొద్దు. మీ సూక్ష్మబుద్ధితో, మీ తెలివి తేటలతో మీ ప్రత్యర్థులను సైతం మార్చగలరు. మీ వ్యక్తిత్వానికి పలువురి నుంచి ప్రశంసలు దక్కుతాయి. అనవసర వివాదాల జోలికి పోకుండా ఉత్తమం. మీ ప్రేమ జీవితం కొంత నిధానిస్తుంది.

మకర రాశి (Capricorn) 

ఇతరులు చెప్పే విషయాలను కాస్త మనసున పెట్టండి. పరిస్థితులపై మీ దృక్పథాన్ని మార్చుకోండి. రిలేషన్‌షిప్‌లో సామరస్యం కోసం మీరే చొరవ చూపించండి. ఇవాళ మీకు అన్ని విధాలా కలిసొచ్చే అవకాశం ఉంది. మీ శక్తి సామర్థ్యాల ముందు ఇతరులు నిలవలేరు. మీరు వెళ్లేదారిలో బిగ్ సక్సెస్ ఎదురుచూస్తుంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ బాస్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఇది అనువైన సమయం. తద్వారా ప్రమోషన్ పొందగలరు.

కుంభ రాశి (Aquarius)

వృత్తిపరమైన ప్రైవసీ, సీక్రెట్స్‌ను బయటకు వెల్లడించకండి. మీరెంత కష్టపడి ముందుకెళ్లినా మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నాలు వెనక నుంచి జరుగుతుంటాయి. వాటిపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. రిలేషన్‌షిప్‌లో ఎప్పుడూ మీరే అజమాయిషీ చలాయించాలనుకోవద్దు. మీ అంతరాత్మ చెప్పేది వినండి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక వైపు మళ్లే అవకాశం లేకపోలేదు. 

మీన రాశి (Pisces) 

కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. ఆర్థికపరంగా అంత కలిసిరాకపోవచ్చు. అయితే దీర్ఘకాలంలో అన్ని సర్దుకుంటాయి. మీకు రావాల్సిన బకాయిలు నెమ్మదిగా వస్తాయి. ఒక మంచి కంపెనీలో మంచి పొజిషన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అక్కడి వాతావరణం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ అధైర్యం చెందవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అన్ని కలిసొస్తాయి. 

Also Read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ తదుపరి టార్గెట్ కర్ణాటకే, ఇవాళ కీలక సమావేశం

Also Read: Number Plate: నువ్వు తోపు సామీ.. రూ. 71 వేల బండికి 15 లక్షల ఫ్యాన్సీ నంబర్‌! ట్విస్ట్ ఏంటంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News