3 December Horoscope: కార్తీకము & కృష్ణపక్షం..తితి- చతుర్దశి..ఈ రాశివారికి అతిగండం

Horoscope Telugu: పన్నెండు రాశుల వారికి నేడు (శుక్రకవారం) ఎలా ఉందో.. జోతిష్య నిపుణులు తెలిపిన వివరాలు మీ కోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 09:21 AM IST
3 December Horoscope: కార్తీకము & కృష్ణపక్షం..తితి- చతుర్దశి..ఈ రాశివారికి అతిగండం

Horoscope prediction today: నేడు పన్నేండు రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం
డిసెంబర్​ 2021 డిసెంబర్​, 03 (శుక్రవారం)
సూర్యోదయం ఉదయం 6:57 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:23 గంటలకు
తిథి- చతుర్దశి - సాయంత్రం 4:58 వరకు
నక్షత్రము: విశాఖ - మధ్యాహ్నం 01:45 గంటల వరకు
రాహుకాలం: ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:10 వరకు 
దుర్ముహూర్తం: ఉదయం 09:02 నుంచి 09:44 వరకు. ఆ తర్వాత 12:31 నుండి  మధ్యాహ్నం 01:13 వరకు
అమృతఘడియలు: ఉదయం 11:49 గంటల నుంచి మధ్యాహ్నం 12:31 గంటల వరకు

రాశి ఫలాలు..

మేష రాశి (Aries)

ఈ రాశి వారికి నేడు ప్రయాణాలు అంతగా కలిసి రావు. అందుకే దూర ప్రయాణాలు ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. డబ్బు విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఖర్చులను అదుపు చేసుకోవాలి. మీ తదుపరి ప్లాన్స్ ఏమిటనే విషయాన్ని ఎవరితోనూ పంచుకోకపోవడమే ఉత్తమం. ఇంత క్లిష్టమైన రోజు అయినప్పటికీ.. మీరు ఓ శుభవార్త వింటారు.

వృషభ రాశి ( Taurus)

జీవితం మీద ఆసక్తి పెంచుకోవాల్సిన తరుణమిది. కుటుంబం కోసం పొదుపు, పెట్టుబడులు పెట్టడం లాభానిచ్చే అవకాశముంది. వ్యాపారులు ఇతర దేశాల్లో ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే.. ఇది మంచి రోజు. మానసిక ప్రశాంతత వల్ల రోజంతా ప్రయోజనాన్ని ఇస్తుంది. వైవాహిక జీవితంలో ఇది మరిచిపోలని రోజుగా మిగులుతుంది. అయితే మీ శ్రీమతి విషయంలో కలుగజేసుకోవడం ఇబ్బందులకు గురి చేయొచ్చు.

మిథున రాశి (Gemini)

ఈ రాశి వారికి నేడు ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అయితే ఖర్చులు పెరగటం వల్ల మీరు చేద్దామనుకున్న పనులకు అడ్డంకులు తలెత్తే అవకాశముంది. విందు, వినోదాలు, సరదాలతో రోజు గడుస్తుంది. కళల రంగంలోని వారికి అవకాశాలు పెరుగుతాయి. మీ కష్ట సమయంలో మీకు తోడుగా మీ జీవిత భాగస్వామి ఉంటారు.

కర్కాటక రాశి (Cancer)

మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే వ్యక్తిని మీరు కలుసుకుంటారు. ఆ వ్యక్తిని మీ స్నేహితుడి ద్వారా కలుసుకునే వీలుంది. మీకు, మీ కుటుంబానికి ప్రయోజనాన్ని చేకూర్చే ప్రాజెక్ట్​లను చేపడతారు. అయితే ఇతరులతో మీ రహస్యాలను వెంటనే చెప్పేయడం వల్ల ఇబ్బందులకు గురిచేయొచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్​ గురించి చర్చిస్తారు. అదే విధంగా మీ వైవాహిక జీవితం కూడా బాగుటుంది.

సింహ రాశి (Leo)

బాధ్యతలు పెరుగుతాయి. అందుకే సరైన నిర్ణయం తీసుకునేందుకు మనసు స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. విందు, విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేయకపోవడం మంచిది. జీవిత భాగస్వామితో ఆహ్లాదంగా గడుపుతారు. ఆత్మీయుల ద్వారా ఒంటరితనం దూరమవుతుంది. మీ తదుపరి స్టెప్స్​ గురించి చెబితే అవి విఫలమయ్యే అవకాశాలున్నాయి.

కన్యా రాశి (Virgo)

మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు. మీలోని భయం, ద్వేషం వంటివి వదిలి.. ఆత్మ విశ్వాసం పెంచుకోవాల్సిన అవసరముంది. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగాలి.  మీ  జీవిత భాగస్వామి అనారోగ్యం మిమ్మల్ని కొంత కలవర పెడుతుంది. విందు, వినోధాలకు మంచి రోజు. అయితే వ్యాపారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఉంది. తీరిక సమయం దొరుకుతుంది.

తులా రాశి (Libra)

పనిలో ఒత్తిడి ఉంటుంది. తోటి ఉద్యోగులు, మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కొంత ఇబ్బంది పడతారు. నమ్మకస్తుల సలహాతో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార, ప్రయాణ ప్రణాళికలు ధీర్ఘ కాలంలో ప్రయోజనాలు ఇస్తాయి. వైవాహిక జీవితంలో నేడు ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి (Scorpio)

మీ బంధాలను (చుట్టాల ద్వారా) ఉపయోగించి మీరు అనుకున్నది సాధిస్తారు. అయితే దీని వల్ల మీ భార్య మీపై కోపం పెట్టుకునే అవకాశముంది. డబ్బుల విషయంలో జాగ్రత్త పాటించాలి. లేదంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. మీ ప్లాన్స్ చెడగొట్టే వారున్నారు జాగ్రత్త.  ప్రేమికులకు ఇది మంచి రోజు. కొంత మందితో మాట్లాడటం వల్ల మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యాపార ప్రణాలికలు ఫలితాలనిస్తాయి. మీ వైవాహిత జీవితం సాఫీగానే సాగుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius)

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. కొన్ని విషయాల గురించి ఆందోళన పడుతారు. ఇంటి దగ్గర పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నా అనే భావన కూడా ఇందులో ఒకటి కావచ్చు. ఆర్థికంగా కాస్త కలిసి వచ్చే కాలం నడుస్తోంది. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగేందుకు అవకాశముంది. ఇతరులతో సఖ్యతగా మెలగటం మంచిది. పనిలో కలిసి వస్తున్నట్లు అనిపిస్తుంది. వైవాహిక జీవితం భాగానే ఉంటుంది.

మకర రాశి (Capricorn)

చిన్న చిన్న విషయాలకు చిరాకుపడటం మీ ఉత్సాహాన్ని దెబ్బతీస్తుంది. వస్తువుల మీద ఎక్కువ ధనం ఖర్చు చేస్తారు. అయితే దీని వల్లన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ఇంట్లో కూడా అనవసర విషయాల వల్ల ఇబ్బందులు పెరిగేందుకు కారణం అవుతారు.  అయితే పెండిగ్​లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. వైవాహిత జీవితం అంతగా బాగోలేదు.

కుంభ రాశి (Aquarius)

మీ బుద్ధిబలం మీకు మేలు చేస్తుంది. అనేక సమస్యలు మీమ్మల్ని చుట్టుముట్టినా.. వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కొంటారు. నష్టాలను కూడా మీకు లాభాలుగా మారుతాయి. ఇతరుల పట్ల జాగ్రత్తగా ఉండండి. తగాదాలకు తావు ఇవ్వకండి. ఆఫీసుల్లో పని చేసే వారు.. ఓ గొప్ప వ్యక్తిని కలిసే అవకాశముంది. కష్టాలను గట్టేక్కే విషయంలో మీ జీవిత భాగస్వామి సహకారం అందకపోవచ్చు.

మీన రాశి (Pices)

ఆరోగ్యం పరంగా మంచి రోజు. స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడతారు. అప్పులు చెల్లించేదుకు సిద్ధమవుతారు. అయితే అనుకోని ఇబ్బందుల్లో పడతారు. సన్నిహితులతో అభిప్రాయ భేధాలు రావచ్చు. రోజంతా టెన్షన్స్​తో గడుస్తుంది. అఫీసులు మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనులను పూర్తి చేసేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేశించాల్సి ఉంటుంది.

Also read: Vastu Tips For Money: ఇంటి ఈశాన్య భాగంలో ఇలా చేయండి.. లక్ష్మిదేవి మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చొంటుంది

Also read: Palmistry: మీ చేతి రేఖలు ఇలా ఉన్నాయా..?? అయితే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారని అర్థం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News