ఇవాళ నవంబర్ 24న మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆ రాశివారు అప్పులు చేస్తారా

గ్రహాలు కదలికలు..రాశులను బట్టి మీ జాతకం ఎలా ఉందో చెప్పేదే జ్యోతిష శాస్త్రం. చాలామందికి జ్యోతిష శాస్త్రంపై నమ్మకముంటుంది. ప్రతిరోజూ తమ జాతకం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉంటుంది.  ఈ క్రమంలో ఇవాళ అంటే నవంబర్ 24వ తేదీన మీ రాశి ఫలాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 24, 2021, 06:53 AM IST
ఇవాళ నవంబర్ 24న మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆ రాశివారు అప్పులు చేస్తారా

గ్రహాలు కదలికలు..రాశులను బట్టి మీ జాతకం ఎలా ఉందో చెప్పేదే జ్యోతిష శాస్త్రం. చాలామందికి జ్యోతిష శాస్త్రంపై నమ్మకముంటుంది. ప్రతిరోజూ తమ జాతకం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉంటుంది.  ఈ క్రమంలో ఇవాళ అంటే నవంబర్ 24వ తేదీన మీ రాశి ఫలాలు తెలుసుకుందాం.

మేషరాశి (Aries)లో పుట్టినవారికి ఈ రోజు పనులలో ఆటంకాలు తొలగుతాయి. కావల్సినవారి నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సమసిపోవచ్చు. అంతా సక్రమంగా జరిగేందుకు కాళికా అమ్మవారికి పూజలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. 

వృషభరాశి ( Taurus) : ఈ రాశివారికి ఇవాళ ప్రతికూలంగా ఉంటుంది. దైనందిన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు, దూర ప్రయాణాలు ఇబ్బందులు కలుగజేస్తాయి. అన్ని వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. 

మిధునరాశి ( Gemini):ఈ రాశివారికి  అన్నీ అనుకూలంగా ఉంటాయి కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకైతే శుభవార్తలు అందుతాయి. వాహనాల కొనుగోలు ఉంటుంది. పనులన్నీ ఏ విధమైన ఆటంకాల్లేకుండా కొనసాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకరాశి ( Cancer): ఈ రాశివారికి పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయి. ముఖ్యంగా  ఇవాళ విద్యార్థులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఈ రాశివారికి  పనుల్లో ఆటంకాలు ఎదురు కావడమే కాకుండజా..ఊహించని ఖర్చు ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకు ఉంటుంది.

సింహరాశి (Leo): ఈ రాశివారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చవచ్చు. పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. 

కన్యారాశి ( Virgo): ఈ రాశివారికి ఇవాళ ఆస్థి వివాదాలు సమసిపోతాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనం కలుగుతుంది. 

తుల రాశి ( Libra): ఈ రాశివారికి ఇవాళ అన్నీ అనుకూలిస్తాయి. అయితే స్నేహితులు, కావల్సినవారితో కాస్త దూరం పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్థి ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

వృశ్చికరాశి ( Scorpio): ఈ రాశివారికి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఈ రోజు దూరప్రయాణాలు చేయవల్సివస్తుంది. బంధువులతో వివాదం ఉండవచ్చు. పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో చికాకు కలుగుతుంది. 

ధనుస్సురాశి ( Sagittarius): ఈ రాశిలో పుట్టినవారికి పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇప్పటి వరకూ పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది.  తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఇంట్లోనూ, బయటా అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల పరిణామాలుంటాయి.

మకరరాశి ( Capricorn): ఈ రాశివారికి ఇవాళ అంతా బాగుంటుంది. ఈ రోజు కుటుంబంతో సంతోషంతో గడుపుతారు. స్నేహితులతో బాగుంటుంది. తలపెట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది.  ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 

కుంభరాశి ( Aquarius): ఈ రాశివారికి కాస్త ప్రతికూల పరిస్థితులు కలుగుతాయి. ఇబ్బందులు ఎదురై..అప్పులు చేస్తారు. ఆలోచనలు మారుతుంటాయి. కుటుంబంలో కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి కలుగుతుంది. 

మీనరాశి ( Pices): ఈ రాశివారికి   పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాలుంటాయి. సోదరులతో విభేదాలు ఇబ్బంది కల్గిస్తాయి. అనారోగ్యం ప్రధాన సమస్యగా మారుతుంది. కుటుంబంలో ఒత్తిళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది.  

Also read: ఇవాళ నవంబర్ 23వ తేదీన మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, మీ లక్కీ టైమ్ ఎప్పుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News