Horoscope prediction today: నేడు శనివారం (డిసెంబర్ 18). ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ముందుగా పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం
2021 డిసెంబర్, 18 (శనివారం)
సూర్యోదయం ఉదయం 7:07 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:26 గంటలకు
తిథి- మార్గశిర శుద్ధ చతుర్దశి ఉదయం 6:29 వరకు తదుపరి పౌర్ణమి
రాహుకాలం: ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 6:26 గంటల నుంచి 07:30 గంటల వరకు
యమగండము: ఉదయం 06:00 గంటల నుంచి 7:30 గంటల వరకు
అమృత ఘడియలు: ఉదయం 10.01 గంటల నుంచి 11.47 గంటల వరకు
రాశి ఫలాలు..
మేష రాశి (Aries)
ఆశించిన ఫలితాలు దక్కుతాయి. సానుకూల ఆలోచనతో ముందుకు సాగుతారు. మీ నైపుణ్యాలతో ఎదుటి వారిను ఆకట్టుకుంటారు. సొంతగా వ్యాపారం చేస్తున్నట్లయితే, విస్తరణ ప్రణాళికలను అమలు చేయడానికి ఇది మంచి సమయం.
వృషభ రాశి (Taurus)
శనివారం మీకు ఒక అద్భుతమైన రోజు. పోటీ పరీక్షలు, ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు, వ్యాపారం ప్రారంభించాలనుకుంటే నిరంతర కృషితో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. వ్యాపారులు విస్తరణ ప్రణాళికలు అమలు చేసేందుకు అనుకూల సమయం నడుస్తోంది.
మిథున రాశి (Gemini)
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన లాభాలు రావచ్చు. వ్యాపారులు కొత్త అసోసియేషన్ లేదా భాగస్వామ్యంలోకి ప్రవేశించవచ్చు. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. ఉద్యోగులుతు తమ పనితీరుతో ప్రశంసలు పొదుతారు.
కర్కాటక రాశి (Cancer)
ఈ రోజు మీకు సవాళ్లతో కూడుకుని ఉంటుంది. అయితే చివరికి అన్ని విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి. రోజువారీ కార్యకలాపాలపై మీ దృష్టిని కేంద్రీకరించండి. మీకు కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు లభిస్తుంది.
సింహ రాశి (Leo)
ఈ రాశి వారికి నేడు ధన లాభం ఉంది. అయితే ఖర్చుల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. వ్యాపారల్లో వృద్ధి సాధిస్తారు. బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కుటుంభ సభ్యులతోనూ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.
కన్యా రాశి (Virgo)
ఈ రోజు మీకు ఆటు పోట్లు ఎదురవుతాయి. అనుకున్నది సాధించాలని పట్టుదలతో ఉంటారు. అయితే తొందర పాటు నిర్ణయాల వల్ల ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో మాత్రం సానుకూలంగా ఉంది. ఇంట్లో పరిస్థితుల వల్ల ఇబ్బంది పడే అవకాశముంది.
తులా రాశి (Libra)
ఆర్థికంగా బలపడే అవకాశాలు లభిస్తాయి. కొత్త పరిచయాల వల్ల మోసపోయే అవకాశముంది జాగ్రత్త. ఫ్యామిలీ విషయంలో కొత్త ఆందోళనకర పరిస్థితి ఎదురవ్వచ్చు. మీకు ఎదురయ్యే అవరోధాలను చాకచక్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. దీర్ఘకాల కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆర్థిక విషయాలలో క్రమబద్ధంగా వ్యవహరించడం వల్ల.. ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారులు కొత్త వెంచర్‌లోకి ప్రవేశించేందు అనుకూల సమయం నడుస్తోంది. ఖర్చులు పెరగొచ్చు. జీవిత భాగస్వామి ద్వారా మంచి విషయాన్ని తెలుసుకుంటారు.
మకర రాశి (Capricorn)
మీ కుటుంబ జీవితం ఆనందంగా గడుస్తుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులకు.. సహోద్యోగుల పూర్తి సహకారం లభిస్తుంది. దీర్ఘ కాలంగా కొనసాగుతున్న టెన్షన్లు తీరుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఓ వ్యక్తితో మాట్లాడుతూ మీ జీవిత విశేషాలను నెమరు వేసుకుంటారు.
కుంభ రాశి (Aquarius)
ఈ రాశివారిలో కొందరికి సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఓ ముఖ్యమైన వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. మీకు ఇష్టమైన వారి ఆనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
మీన రాశి (Pices)
పనిలో ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశముంది. అయినప్పటికీ మీకు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మీకు హాని చేయాలని చూసేవారిపట్ల జాగ్రత్త అవసరం. మీకు ఇష్టమైన వారే మిమ్మల్ని బాధ పెట్టొచ్చు.
Also read: Shani Dev blessings: ఆ మూడు రాశుల వారికి శని దేవుడి ఆశీస్సులు.. వాళ్లు పట్టుకుందంతా బంగారమే
Also read: How to please lord Hanuman: హనుమంతుడిని ఇలా పూజిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook