Holi 2024: హోలీని ఈ ప్రాంతంలో రంగులతోకాదు.. చితాభస్మంతో ఆడతారు..

Holi 2024: హోలీ రంగురంగుల పండుగ. ఈరోజు హోలికా దహనం ప్రత్యేకం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాది హోలీ 2024 మార్చి 24వ తేదీన రానుంది. అయితే, సాధారణంగా హోలీని గులాల్ రంగులతో ఆడతారు. కానీ, మన దేశంలోని ఈ ప్రాంతంలో మాత్రం హోలీని చితాభస్మంతో ఆడతారు ఆ ప్రదేశం ఏంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 18, 2024, 01:05 PM IST
Holi 2024: హోలీని ఈ ప్రాంతంలో రంగులతోకాదు.. చితాభస్మంతో ఆడతారు..

Holi 2024 With Ashes: హోలీ రంగురంగుల పండుగ. ఈరోజు హోలికా దహనం ప్రత్యేకం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాది హోలీ 2024 మార్చి 24వ తేదీన రానుంది. అయితే, సాధారణంగా హోలీని గులాల్ రంగులతో ఆడతారు. కానీ, మన దేశంలోని ఈ ప్రాంతంలో మాత్రం హోలీని చితాభస్మంతో ఆడతారు ఆ ప్రదేశం ఏంటో తెలుసుకుందాం.ఫాల్గుణమాసంలో వచ్చే పూర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఈరోజు ప్రభుత్వ సెలవుదినంగా కూడా పాటిస్తారు. బనారస్‌లో మాత్రం హోలీనిక రంగులతోకాకుండా బూడిదతో ఆడతారు. పురాణాల ప్రకారం ఒకనాడు పార్వతిదేవితో శివుడు కాశీకి వచ్చాడు అయితే,అందరూ తమ బంధువులు, స్నేహితులతో రంగులు ఆడటం చూశాడు. స్మశానంలో మాత్రం ఆత్మలు, దయ్యాలు, గంధర్వులు ఈ వేడుకలు జరుపుకోలేకపోయాయి. ఆ తర్వాత హోలీ ముందు వచ్చే ఏకాదశి నుంచి శివుడు శ్మశానవాటిలో నివసించే ఆత్మలు , దయ్యాలు, పిశాచాలతో హోలీ ఆడాడని నమ్ముతారు అప్పటినుంచే ఈ సంప్రదాయం మొదలైంది.కాశీలో మాత్రమే చితాభస్మంతో హోలీ జరుపుకుంటారు. మణికర్ణిక, ఘాట్ లో హరహర మహాదేవ అంటూ ఒకరికొకరు చితాభస్మాన్ని సమర్పించుకుంటారు.

ఇదిలా ఉండగా హోలీ సందర్భంగా నిర్వహించే హోలికా దహనాన్ని కొత్తగా పెళ్లైన అమ్మాయిలు తమ అత్తవారింట చూడకూడదట. ఒకవేళ పొరపాటున అత్తాకోడళ్లు కలిసి హోలీకా దహనం చూస్తే అత్తాకోడళ్లకు మధ్య గొడవలు జరుగుతాయి.  అంతేకాదు హోలికా దహనాన్ని గర్భిణులు కూడా చూడకూడదని పండితులు చెబుతారు. అదే కొత్తగా పెళ్లైన మహిళ పుట్టింట హోలీ పండుగ జరుపుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Holi 2024: కొత్తగా పెళ్లైన మహిళ హోలీని అత్తారింట్లో జరుపుకోకూడదు? ఎందుకో తెలుసా?

పురాణాల ప్రకారం హోలీ పండుగ గురించి రకరకాల కథనాలు చెబుతారు. శివుడుని పార్వతిదేవి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ, శివుడు తపస్సులో మునిగిపోతాడు. అప్పుడు శివయ్యలో ప్రేమను పుట్టించేందుకు కామదేవుడైన మన్మథుడు మన్మథ బాణం వదులుతాడు దీంతో కోపోద్రిక్తుడైనా శివుడు మూడో కన్న తెరచి కామదేవుడిని భస్మం చేస్తాడు. బూడిదగా మారిన తన భర్తను చూసి రతిదేవి వైధవ్యాన్ని మోయాల్సి వస్తుంది.ఆ తర్వాత శివుడికి పార్వతి మొత్తం విషయాన్ని చెప్పింది కానీ, ఇప్పటి వరకు ఆపవాదం కామదేవుడు మోస్తూనే ఉన్నాడు. 

ఇదీ చదవండి: బాత్రూమ్ లో నగ్నంగా స్నానం చేస్తున్నారా..?.. మీ జీవితంలో ఈ అరిష్టాలు తప్పవంటున్న జ్యోతిష్యులు..

ఇదిలా ఉండగా హోలీ రోజే మొదటి చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. మార్చి 25న ఉదయం 10:23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:02 గంటల చంద్రగ్రహణం ఉంటుంది. అయితే, ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News