Ugadi 2023 date: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో ఉగాది ఒకటి. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 'ఉగాది'గా, మహారాష్ట్రలో 'గుడి పడ్వా'గా, తమిళనాడులో 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతోను, సిక్కులు 'వైశాఖీ' గానూ, బెంగాలీలు 'పొయ్‌లా బైశాఖ్' గానూ జరుపుకుంటారు.
తెలుగు లోగిళ్లలో ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. అంతేకాకుండా రుచికరమైన ఉగాది పచ్చడి కూడా చేస్తారు. ఉగాది తెలుగువారికి సంవత్సరాది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజునే బ్రహ్మ సృష్టిని నిర్మించాడని నమ్ముతారు. అంతేకాకుండా చైత్ర నవరాత్రులు ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి. రైతులు ఇదే సమయంలో పంటలు వేస్తారు. కొత్త జీవితానికి నాందిగా ఈ వేడుకను చేసుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన కారణంగా ఈ పండుగ ప్రాచుర్యంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సంవత్సరం ఈ పండుగ మార్చి 22న రాబోతుంది. ఈరోజున తెలుగు రాష్ట్రాల్లో చేసే వేపపువ్వు పచ్చడి సూపర్ గా ఉంటుంది. ఇందులో వేప పువ్వు, బెల్లం, కొబ్బరి కోరు, అరటి పండ్లు, మామిడి కాయ, ఉప్పు, శనగలు, చింతపండు మెుదలైనవి వేసి చేస్తారు. అంతేకాకుండా ఈ దినాన మిత్ర దర్శనమం ఆర్యపూజనం, గోపూజ, ఏరువాక అనే ఆచారాలను పాటిస్తారు. ఈ పండుగ జరిగిన వారం రోజుల్లో శ్రీరామనవమి వస్తుంది.
Also Read: Chandra Grahanam 2023: తొలి చంద్రగ్రహణం ఎప్పుడు? ఇది భారతదేశంలో కనిపిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook