Hariyali Teej 2022: హరియాళీ తీజ్ వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Hariyali Teej 2022:  భర్త దీర్ఘాయువు, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం పెళ్లైన మహిళలు హరియాళీ తీజ్ వ్రతాన్ని చేస్తారు. ఈరోజున పార్వతీపరమేశ్వరులను పూజిస్తారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 23, 2022, 05:15 PM IST
  • పండుగలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం
  • జూలై 31న హరియాలీ తీజ్
  • ఈ రోజున స్త్రీలు ఉపవాసం పాటిస్తారు
Hariyali Teej 2022: హరియాళీ తీజ్ వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Hariyali Teej 2022 Vrat: హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలోనే ఎక్కువగా పండుగలు వస్తాయి. ఇదే కోవలోకి చెందుతుంది హరియాలీ తీజ్ వ్రతం. దీనిని శ్రావణంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది ఇది  31 జూలై 2022, ఆదివారం వచ్చింది. ఈ పండుగ నాడు వివాహిత స్త్రీలు రోజంతా ఉపవాసం ఉండి.. భర్త దీర్ఘాయువు, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం పార్వతీపరమేశ్వరులను పూజిస్తారు. వారు సంతోషించి వీరు కోరికలు తీరుస్తారు. 

శ్రావణ మాసంలో ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది. అందుకే దీనిని హరియాలీ తీజ్ అంటారు. మత గ్రంథాల ప్రకారం, హరియాలీ తీజ్ వ్రతం శివుడు మరియు తల్లి పార్వతి యొక్క పునఃకలయికను సూచిస్తుంది. ఈ రోజున మాత పార్వతి కఠోర తపస్సు చేసి పరమశివుని పొందిందని చెబుతారు. అందువల్ల ఈ రోజున వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం దక్కాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 

హరియాలీ తీజ్ శుభ ముహూర్తం
హరియాలీ తీజ్ వ్రతం తేదీ: 31 జూలై 2022, ఆదివారం
శ్రావణ శుక్ల తృతీయ తేదీ ప్రారంభం: 31 జూలై, 2022 ఉదయం 02:59 గంటలకు
శ్రావణ శుక్ల తృతీయ తేదీ ముగింపు: ఆగస్టు 1, 2022 ఉదయం 4:18 గంటలకు

అదే రోజు రెండు శుభయోగాలు
హరియాలీ తీజ్ వ్రతం రోజున వరియన్ మరియు రవి యోగా వంటి శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఆగస్టు 1, 2022 ఉదయం 2:20 నుండి ఉదయం 6.04 వరకు రవియోగం ఉంటుంది. మరోవైపు, అభిజీత్ ముహూర్తం హరియాలీ తీజ్‌లో మధ్యాహ్నం 12:9 నుండి 1:01 వరకు ఉంటుంది. 

Also Read: Jupiter Retrograde 2022: మీనంలో గురుడు తిరోగమనం... ఈ 4 రాశులవారి కెరీర్ అద్భుతం!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News