Sravana Amavasya 2022: హరియాళీ అమావాస్య పండుగను శ్రావణ మాసం అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది హర్యాలీ అమావాస్య (Hariyali Amavasya 2022) 28 జూలై 2022న వస్తుంది. ఈ రోజున స్నానానికి, దానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య రోజున మెుక్కలు నాటడం శుభప్రదంగా భావిస్తారు. మరోవైపు, ఈ హరియాళీ అమావాస్య నాడు కొన్ని ప్రత్యేక చెట్లను పూజించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి.. అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. హరియాళీ అమావాస్య నాడు చెట్లను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడాబాధ్యత తీసుకోండి.
హరియాళీ అమావాస్య 2022 తేదీ
ప్రారంభం - 27 జూలై 2022, బుధవారం 09:11
ముగింపు- గురువారం 28 జూలై 2022, రాత్రి 11:24 వరకు
అమావాస్య రోజున ఈ చెట్లను పూజించండి
వేప చెట్టు: సంతానం కలగాలంటే ఈ రోజు వేపచెట్టును పూజించండి. అంతేకాకుండా ఇది అనేక వ్యాధులను దూరం చేస్తుంది. హరియాళీ అమావాస్య నాడు ఈ మెుక్కను నాటడం వలన పితృదోషం పోతుంది.
రావిచెట్టు: హిందూమతంలో రావిచెట్టును ప్రత్యేక స్థానం ఉంది. త్రిమూర్తులు ఈ చెట్టులో నివశిస్తారని నమ్ముతారు. హరియాళీ అమావాస్య నాడు ఈ చెట్టును పూజించడం వల్ల శని మహాదశ తొలగిపోతుంది.
మర్రిచెట్టు: హరియాళీ అమావాస్యనాడు దీనిని పూజిస్తే అఖండ సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
జామ చెట్టు: డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడాలంటే...హరియాళీ అమావాస్య నాడు జామ చెట్టును పూజించండి. సాయంత్రం పూట చెట్టుకింద నెయ్యి దీపం పెట్టండి.
మారేడు మెుక్క (బిల్వ వృక్షం): శ్రావణంలో బిల్వ వృక్షాన్ని పూజించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. ఈ రోజున బిల్వ పత్రాలను ఎప్పుడూ చింపకండి. లేకపోతే శివుడికి కోపం వస్తుంది.
Also Read: Mars Transit Effect 2022: వృషభరాశిలో కుజుడు సంచారం... ఈ 5 రాశులవారికి బంపర్ ప్రయోజనాలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook