Happy Ugadi 2024 Wishes In Telugu: ఉగాది అంటేనే తెలుగు ప్రజల పండగ ఈ పండగ నుంచి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. అంతేకాకుండా ఈరోజు పంచాంగం లో భాగంగా కొత్త సంవత్సరంలో గ్రహాల స్థితులు రాశి ఫలాలు కూడా తెలుసుకుంటారు. అలాగే ఉగాది రోజున హిందువులంతా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పిండివంటలతో పాటు ఉగాది పచ్చడిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. షడ్రచుల సమ్మేళనాలను కలిగి ఉన్న ఈ ఉగాది పచ్చడి (Ugadi Pachadi) జీవితంలో కలిగే అన్ని అనుభవాలను సూచిస్తుంది. అంతేకాకుండా మరికొన్ని చోట్ల రైతులంతా పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామాల్లో ఈ పండగ రోజున గడపగడప తోరణాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగను ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో సుఖసంతోషాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఇష్టమైన వారికి ఈ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి.
క్రోధినామ సంవత్సర ఉగాది ప్రత్యేకమైన టాప్ 10 కోట్స్:
"కొత్త ఆశలకు, కలలకు, కృషికి నాంది పలికే శుభదినం ఉగాది. ఈ సంవత్సరం మీ జీవితంలో శ్రేయస్సు, సంతోషం నింపాలని కోరుకుంద్దాం."
"క్రోధినామ సంవత్సరం మనలోని కోపాన్ని, ద్వేషాన్ని జయించి, ప్రేమ, సహనంతో ముందుకు సాగాలని స్ఫూర్తినిస్తుంది."
"పండుగలకు పున్నమి వలె, మన జీవితాలకు ఉగాది ఒక మధురమైన ప్రారంభం. ఈ సంవత్సరం మీకు మంచి పంటలు, మంచి ఆరోగ్యం, శుభం కలగాలి."
"భూతకాలం భారం వదిలి, భవిష్యత్తు ఆశతో ముందుకు సాగడానికి ఉగాది ఒక అవకాశం. ఈ సంవత్సరం మీకు కొత్త దిశానిర్దేశం చూపించాలని కోరుకుంద్దాం."
"ఉగాది పండుగ మనల్ని మనం పునరుద్ధరించుకోవడానికి, మన జీవితాలను మెరుగుపరచుకోవడానికి ఒక అవకాశం."
"క్రోధినామ సంవత్సరం మనకు ధైర్యం, ఓర్పు, పట్టుదల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈ సంవత్సరం మీకు ఈ లక్షణాలతో జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాం."
"ఉగాది పండుగ సందర్భంగా, మీ కుటుంబం, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపాలని కోరుకుంటూ.. మీ అందరికీ ఉగాది శుభోదయం."
"క్రోధినామ సంవత్సరం మనలోని సృజనాత్మకతను, నైపుణ్యాలను బయటకు తీసుకురావడానికి ఒక కొత్త అవకాశం. ఈ ఛాన్స్‌లతో క్రోధినామ సంవత్సరంలో కొత్త లక్ష్యాలను సాధించాలి కోరుకుంద్దాం."
"ఉగాది పండుగ మనకు సమాజం ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మీకు సమాజానికి సేవ చేయడానికి ఒక అవకాశం కలగాలని కోరుకుంటున్నాము."
"క్రోధినామ సంవత్సరం మనకు ప్రపంచం అందాన్ని, ప్రకృతి వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఈ సంవత్సరం మీకు ప్రకృతితో సంతోషంగా జీవించడానికి ఒక అవకాశం రావాలని కోరుకుంటున్నాము."
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి