Guru Vakri 2022: మీనంలో తిరోగమనం చేయనున్న గురుడు.. ఈ 3 రాశుల వారికి ఊహించని ధనం!

Jupiter Retrograde 2022: దేవతల గురువు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి మీన రాశిలో తిరోగమనం చేయనుంది. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2022, 08:35 AM IST
Guru Vakri 2022: మీనంలో తిరోగమనం చేయనున్న గురుడు.. ఈ 3 రాశుల వారికి ఊహించని ధనం!

Jupiter Retrograde 2022: దేవ గురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయిన మీనంలో తిరోగమనం చెందుతున్నాడు. నవంబర్ 23 వరకు అదే స్థితిలో ఉంటాడు. మీనంలో గురుడు తిరోగమనం (Jupiter Retrograde 2022) మెుత్తం 12 రాశులవారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే గురు వక్రి మూడు రాశులవారికి మాత్రం ఉద్యోగ, వ్యాపారాల్లో భారీ లాభాలను ఇస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటకం (Cancer): బృహస్పతి తిరోగమనం ఈ రాశి వారికి చాలా శుభప్రదం.  ఈ రాశివారు ఉద్యోగ-వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అదృష్టంతో మీరు ఎంత కష్టమైన పని అయినా ఈజీగా చేస్తారు. కోర్టు కేసుల్లో మీకు ఉపశమనం లభిస్తుంది. పిల్లల చదువుల విషయంలో నిశ్చియంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 

మిథునం (Gemini): గురు వక్రి మిథున రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించేలా చేస్తుంది. అంతేకాకుండా ఉద్యోగంలో కొత్త బాధ్యత, ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందుతారు. వ్యాపారంలో అనేక కొత్త డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది.  మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో శుభ కార్యాలు కూడా జరగవచ్చు.

వృషభం (Taurus): బృహస్పతి తిరోగమనం ఈ రాశివారి ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి. కొత్త మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. బిజినెస్ పెరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీల నుండి వీరు ఆర్ఢర్లు పొందుతారు. ఈ సమయంలో మీరు ఏదైనా ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. 

Also Read: Shukra Gochar 2022: శుక్రుడి కన్యారాశి ప్రభావం, సెప్టెంబర్ 24 ఉదయం 8 గంటల్నించి ఆ మూడు రాశుల పరిస్థితి ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News