Jupiter Uday 2023: వేద జ్యోతిషశాస్త్రంలో దేవగురు బృహస్పతిని శుభప్రదమైన గ్రహంగా భావిస్తారు. మీ జాతకంలో గురు గ్రహం శుభస్థానంలో ఉంటే వారికి దేనికీ లోటు ఉండదు. ఏప్రిల్ నెలలో బృహస్పతి గ్రహం ఉదయించబోతుంది. దీని కారణంగా అరుదైన ధన రాజయోగం (Dhan Rajyog) ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. బృహస్పతి ఉదయం ఈరాశులకు ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మీన రాశిచక్రం (Aries): ధన రాజయోగం ఏర్పడడం వల్ల మీన రాశి వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఉదయిస్తాడు. దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో రెట్టింపు లాభం ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈరాశికి అధిపతి బృహస్పతి కాబట్టి దీని సంచారం వ్యాపారులకు భారీగా లాభాలను ఇస్తుంది.
కర్కాటక రాశిచక్రం (Cancer): ధన రాజయోగం మీకు వృత్తి మరియు వ్యాపారాల్లో లాభాలను ఇస్తుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి పదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది. బిజినెస్ విస్తరిస్తుంది. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. చంద్రుని రాయిని ధరించడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది.
సింహ రాశి (Leo): ధన రాజయోగం ఏర్పడడం వల్ల సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ధన లాభం ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి తొమ్మిదో ఇంట్లో ఉదయించబోతున్నాడు. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు.
Also Read: Surya Gochar 2023: ఈ రాశులవారికి త్రికోణ గ్రహి అధిపతి రాజయోగం.. ఈ వీరికి పట్టిందల్లా బంగారమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి