Guru chandal yog 2023: గురు చండాల యోగం కారణంగా ఈ రాశులవారి జీవితాలు భయంకరంగా మారబోతున్నాయి!

Guru chandal yog 2023: గురు చండాల యోగం కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందలు పడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఇబ్బందుల కారణంగా తీవ్ర ఆర్థిక సమస్యలు వస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 10, 2023, 12:04 PM IST
Guru chandal yog 2023: గురు చండాల యోగం కారణంగా ఈ రాశులవారి జీవితాలు భయంకరంగా మారబోతున్నాయి!

Guru chandal yog 2023: ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో రాశి సంచారం చేస్తుంది. గ్రహాలు రాశి సంచారాలు చేయడంవల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతాయి. అయితే ఏదైన రాశిలో గురు, రాహువు గ్రహాలు సంచారం చేసి కలవడం కారణంగా గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావం అన్ని రాశులవారిపై తీవ్రంగా పడబోతోంది. కాబట్టి ఈ యోగం ప్రభావం ఉన్నవారు అక్టోబర్‌ వరకు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ చెడు యోగ ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి:
మేష రాశి:

ఈ యోగం మేషరాశి వారి జీవితాల్లో  కీలక మార్పలు తీసుకు రాబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర నష్టలు కూడా కలగొచ్చు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

మిథున రాశి:
గురు చండాల యోగం మిథునరాశి రాశివారిపై ప్రత్యేక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో వీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీరు పెట్టుబడులు పెట్టడం మానుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ జీవితం, వృత్తి జీవితం గడుపుతున్నవారికి తీవ్ర నష్టాలు రావచ్చు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

కన్య రాశి:
కన్యారాశి వారు ఈ క్రమంలో పనుల్లో లాభాలు పొందడానికి తప్పకుండా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో కుటుంబంలోని పెద్దలు అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.

Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News