Grah Gochar in January 2024: ఈ నెలంతా ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

January Grah Gochar 2024: నూతన సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు అంగారకుడు స్థానంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దీంతో జనవరి నెలలో మూడు రాశులవారు బాగుపడనున్నారు. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2024, 01:17 PM IST
Grah Gochar in January 2024: ఈ నెలంతా ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Planet transit in January 2024: న్యూఇయర్ లో ప్రతి ఒక్కరూ తమ జీవితం బాగుండాలని కోరుకుంటారు. దానికి తగినట్లుగానే వారు తమ రాశిఫలాలు గురించి ముందుగా జ్యోతిష్య నిపుణులను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్యూచర్ బాగుండాలంటే మీ జాతకంలోని గ్రహాల స్థానం ముఖ్యం. అందుకే చాలా మంది కుండలిలోని గ్రహాలు బలపడాలని పూజలు చేస్తారు. జనవరి నెలలో కూడా కొన్ని కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు కుజుడు తమ రాశులను మార్చబోతున్నారు. ఈ గ్రహాల కదలిక వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

కన్య రాశి
గ్రహల రాశి మార్పు కన్యారాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు. ఆగిపోయిన పనులు వెనువెంటనే పూర్తవుతాయి. మీరు ఏ మంచి పని చేసినా దానికి ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగ, వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. 
మేష రాశి
జనవరి నెలలో గ్రహాల సంచారం మేషరాశి వారికి శుభకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేపట్టే ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకుంటారు, దీంతో మీ శాలరీ కూడా పెరుగుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. కొత్త ఏడాదిలో మీ లవ్ సక్సెస్ అవుతుంది. 

Also Read: Saturn Retrograde 2024: ఈ ఏడాది రివర్స్ లో కదలనున్న శని... ఈ 3 రాశులవారికి వద్దన్నా డబ్బు..

మకర రాశి
ఈ ఏడాది మెుదటి నెల మకరరాశి వారికి బోలెడు ప్రయోజనాలను అందించనుంది. మీ అన్ని కష్టాలు దూరమవుతాయి. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీ ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం వస్తుంది. జాబ్ చేసేవారికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులు లాభపడతారు. 

Also read: Rahu And Ketu: రాహు-కేతువు నక్షత్ర సంచారం..ఈ రాశులవారికి డబ్బుల వర్షమే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News