Grah Gochar 2024: జనవరిలో కీలక గ్రహ సంచారాలు.. న్యూఇయర్ లో లాభం పొందబోయే రాశులు ఇవే..

January  2024 Grah Gochar: 2024 జనవరిలో కొన్ని పెద్ద గ్రహ రాశుల గమనంలో పెను మార్పు రాబోతుంది. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు తమ కదలికలను మార్చనున్నాయి. ఇది కొన్ని రాశులవారికి కలిసిరానుంది. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2023, 08:38 PM IST
Grah Gochar 2024: జనవరిలో కీలక గ్రహ సంచారాలు.. న్యూఇయర్ లో లాభం పొందబోయే రాశులు ఇవే..

Grah Gochar 2024 In January: మరో రెండు వారాల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2024లో కొన్ని పెద్ద గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. ఈ గ్రహాల కదలిక మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేయనుంది. జనవరి నెలలో గ్రహాల రాజు సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు, రాక్షసుల గురువైన శుక్రుడు ప్రస్తుతం ఉన్న రాశులను విడిచిపెట్టి వేరే రాశుల్లోకి ప్రవేశించనున్నాయి.  ఈ గ్రహ మార్పులు కొందరి జీవితాలపై శుభ ప్రభావాన్ని చూపబోతున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

వృశ్చిక రాశిలోకి బుధుడు 
గ్రహాల యువరాజైన బుధుడు జనవరి 02న వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం రెండు రాశులవారికి అనుకూలంగా ఉండనుంది. మెర్క్యూరీ సంచార సమయంలో మకరం మరియు కుంభరాశుల వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు జాబ్, ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. 

మకరరాశిలోకి సూర్యుడు 
ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యుడు నెలకొకసారి రాశిని మారుస్తాడు. 2024 జనవరిలో సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జనవరి 15వ తేదీ తెల్లవారుజామున 2:54 గంటలకు సూర్యుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. భాస్కరుడు రాశి మార్పు కారణంగా మేషం, కుంభం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. 

ధనుస్సు రాశిలోకి శుక్రుడు 
కొత్త సంవత్సరంలో శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జనవరి 18 రాత్రి 8:56 గంటలకు వృశ్చికరాశిని వదిలి ధనుస్సు రాశిలోకి వెళ్తాడు శుక్రుడు. ఈ శుక్ర సంచారం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. మేషం, వృషభం మరియు కర్కాటక రాశులవారి కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది. 

Also Read: Saturn Retrograde effect: 2024లో తిరోగమనంలో శని... ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News