Four Rajyog in Kundali 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక నిర్దిష్ట కాలం తర్వాత అన్ని గ్రహాలు తమర రాశిచక్రాన్ని మారుస్తాయి. త్వరలో నాలుగు రాజయోగాలు ఏకకాలంలో ఏర్పడనున్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ అద్భుత యాదృచ్ఛికం జరగబోతుంది. నీచభంగ్, శష్, బుధాదిత్య మరియు గజకేసరి అనే నాలుగు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాల ప్రభావం అన్ని రాశులపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఈ నాలుగు రాజయోగాలు కారణంగా మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
కుంభ రాశి
20 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న నాలుగు రాజయోగాలు కుంభరాశివారికి లాభాన్ని ఇస్తుంది. దీంతో మీరు అనుకోకుండా ధనలాభాన్ని పొందుతారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కుంభ రాశిలోని లగ్న రాశిలో శష్ రాజయోగం ఏర్పడుతుండగా, ధన గృహంలో నీచభంగ్ రాజయోగం ఏర్పడుతోంది. దీంతో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది.
మకర రాశి
ఈ నాలుగు రాజయోగాల సృష్టి మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ జాతకంలో గజకేసరి, బుధాదిత్య, నీచభంగ్ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీరు చర స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ఫెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో అన్నదమ్ముల సహకారం లభిస్తుంది.
మేషరాశి
20 సంవత్సరాల తర్వాత ఏర్పడిన నాలుగు రాజయోగాలు మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. మీ కుండలిలోని రెండో ఇంట్లో ఈ యోగాలు ఏర్పడుతున్నాయి. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
Also read: Budh Shukra yuti 2023: మేషంలో మూడు గ్రహాల గొప్ప కలయిక.. ఈరాశులకు తిప్పలు తప్పవు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rajyog 2023: సుమారు 20 ఏళ్ల తర్వాత 4 రాజయోగాలు.. ఈ రాశుల వారికి స్పెషల్ బెనిఫిట్స్