10 Vastu tips to increase the flow of money into your house: ప్రపంచంలో చాలా మంది రోజూ డబ్బు కోసమే పరిశోధిస్తుంటారు.. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది సహజమే. డబ్బు కోసం అందరూ ఎంతో కష్టపడుతుంటారు. చాలా మంది తమ ఇళ్లలోకి ధనలక్ష్మి (Dhanalakshmi) అలా నడుచుకుంటూ రావాలని కోరుకుంటారు. అందుకోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని సఫలం అవుతుంటాయి.. మరికొన్ని విఫలం కూడా కావొచ్చు.
ప్రపంచంలో ఏ మనిషి అయినా సంతోషంగా జీవించాలంటే డబ్బు చాలా ముఖ్యం. ప్రస్తుతం సమాజంలో డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలం. డబ్బుకు (Money) అంత ప్రాముఖ్యత ఉండటం వల్లే.. దాన్ని సులభంగా ఎలా సంపాదించాలి.. ఆదాయం (Income) ఎలా పెంచుకోవాలి అని అందరూ ఆలోచిస్తుంటారు.
అయితే కొందరు ఎంత కష్టపడ్డా డబ్బు ఎక్కువ సంపాదించలేరు..అలాగే సంపాదించిన డబ్బు (Money) వారి దగ్గర ఉండకుండా వెళ్లిపోతూ ఉంటుంది. అయితే డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలు అంటున్నారు వాస్తు నిపుణులు. డబ్బు కోసం వాస్తు సూచనలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.
Also Read : Sirivennela Seetharamasastry: ముగిసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు
సంపాదన పెరగాలి.. డబ్బు ఎక్కువగా మన చేతుల్లో ఉండాలి అనుకునే వారు ఇళ్లలో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు (Tips) పాటిస్తే మేలు. వాస్తు శాస్త్రం (Vastu shastram) ప్రకారం ఈ సూచనలు అనుసరిస్తే డబ్బు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.
డబ్బు కోసం మీ ఇంటిలో పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఇవే..
* ఇంట్లో దక్షిణం (South) వైపు కాస్త ఎత్తు ఉండేలా చూసుకోవాలి లేదంటే దక్షిణం వైపు ఎత్తు సమానంగా అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి పక్కాగా ప్లాన్ చేసుకోవాలి.
* ఇక ఇంటి ఈశాన్య (North East) భాగంలోని ఉత్తరం వైపు డోర్ ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మెరుగవుతాయి.
* ఈశాన్యం-తూర్పు ద్వారాన్ని తెరిచి ఉంచడం వల్ల మంచి పేరు ప్రతిష్టలతో పాటు ధనప్రాప్తి ఉంటుంది.
* ఈశాన్యంలో నీటి నిల్వ ఉంచుకునే సంప్ (water storage sump) ఉండడం మేలు. దీంతో డబ్బుతో పాటు ఆ ఇంటిలో శాంతి ఉంటుంది.
* ఇక భారీగా బరువు ఉండే వస్తువులను (heavy stored items) దక్షిణ, నైరుతి వైపు ఉంచడం వల్ల ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మెరుగవుతాయి.
* ఇంటి ముందు పోర్టికో అంటే చుంచు టైప్‌లో ఉండే కట్టడం ఉత్తరం వైపు వాలి ఉంటే మంచింది. దీని వల్ల కూడా ఆదాయం పెరుగుతుంది.
* ఇంటి పై స్ట్రీట్ ఫోకస్ ఉంటే కూడా ఆ ఇంట్లో వారి సంపాదన పెరుగుతుంది.
* ఇక మనం ఉండే ఇళ్లు లేదు అపార్ట్‌మెంట్ దక్షిణం వైపు (Southside) ఉందనుకోండి అలాంటి ఇళ్లలోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్రం చెప్తోంది.
* పడమర (West) వైపు ఉండే అపార్ట్‌మెంట్లలోకి, ఇళ్లపై ధనలక్ష్మి ప్రభావం బాగా ఉంటుంది. అలాంటి ఇళ్లలో ఉండే వారికి సంపాదన పెరిగి డబ్బు వస్తూ ఉంటుంది.
* ఇక నైరుతి వైపు నిర్మించే భారీ నిర్మాణాలలోకి, పెద్ద భవనాల్లోకి ఎల్లప్పుడూ డబ్బు ప్రవాహం బాగానే ఉంటుంది.
Also Read : Jawad Cyclone Alert: ఏపీ తీరంవైపుకు దూసుకొస్తున్న తుపాను, జవాద్‌గా నామకరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Vastu Tips For Money: ఇంటి ఈశాన్య భాగంలో ఇలా చేయండి.. లక్ష్మిదేవి మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చొంటుంది
డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు
డబ్బు కోసం ఈ వాస్తు సూచనలు ఎంతో ఉపయోగకరం
వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లలో చిన్న చిట్కాలు పాటిస్తే ప్రయోజనకరం