Elachi Remedies for Money: చాలామంది కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తుంటారు. కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది. ఇంట్లో ధనం నిలవని కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు. కష్టపడే తత్వం ఉన్నప్పటికీ, డబ్బు రాబడి ఉన్నప్పటికీ ఆదాయం నిలవకపోవడమనేది చాలామంది ఎదుర్కొనే సమస్య. జ్యోతిష్యశాస్త్రంలో ఇందుకు కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి. అందులో ఒకటి యాలకుల పరిహారం. ఇది చాలా సులువైన పరిహారం. దీన్ని పాటించడం ద్వారా కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పును గమనిస్తారు.
యాలకుల పరిహారం.. ఎలా చేయాలి..
ఆకుపచ్చ రంగులో ఉన్న 5 యాలకులను తీసుకుని మీ పర్సులో ఉంచుకోవాలి. ప్రతీ 2, 3 రోజులకొకసారి వాటిని మారుస్తుండాలి. అలాగే, ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే అల్మారాలోనూ 5 ఆకుపచ్చ యాలకులు ఉంచాలి. వాటిని కూడా ప్రతీ 2, 3 రోజులకొకసారి మార్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులు ఉంచరాదు. ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే, ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది. తద్వారా మీ నుంచి లేదా మీ ఇంటి నుంచి ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుంది. ధనం మీ చెంతనే నిలిచి ఉంటుంది.
మీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే.. భిక్షమెత్తుకునేవారికి ఒక నాణెంతో పాటు యాలకులను దానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా కొద్దిరోజుల పాటు చేయడం వల్ల కొద్దిరోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు.
ఉద్యోగంలో ఎదుగుదల లేనివారు ఉద్యోగ ప్రమోషన్ కోసం ఈ చిట్కా పాటిస్తే ప్రయోజనం ఉండవచ్చు. ఒక ఆకుపచ్చ వస్త్రంలో కొన్ని యాలకులను చుట్టి.. వాటిని మీరు పడుకునే దిండు కింద ఉంచి నిద్రించాలి. ఉదయాన్నే ఆ యాలకుల స్థానంలో కొత్త వాటిని చేర్చాలి. ఇలా కొద్దిరోజుల పాటు చేయడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉండొచ్చునని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.
(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ తెలుగు న్యూస్ దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chikoti Praveen: బీజేపీలోకి టీడీపీ ఎంపీ కనకమేడల? క్యాసినో చీకోటీ ప్రవీణ్ తో లింకులే కారణమా?