Kanya Sankranti 2023: ఈ విశ్వమంతటికి వెలుగును ప్రసారించే దేవుడు సూర్యుడు. ఇతడిని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. భాస్కరుడు ప్రతి నెలా రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం 12 రాశులలో సంచరిస్తాడు ఆదిత్యుడు. సూర్యుడి రాశి మార్పునే హిందువులు సంక్రాంతి అని పిలుస్తారు. రేపు అంటే సెప్టెంబరు 17న సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే కన్యా సంక్రాంతి అంటారు. ఈ పవిత్రదినాన పేదలకు దానదర్మాలు చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈరోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం మంచిది. కన్యా సంక్రాంతి రోజున విశ్వకర్మను కూడా పూజిస్తారు.
సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చేయండి
ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి రాగి చెంబులో నీరు తీసుకుని సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వండి. ఎరుపు రంగు దుస్తులు ధరించి నుదుటిపై గంధాన్ని రాసుకుని సూర్యుడిని పూజించాలి. భాస్కరుడికి పూలు, రోలీ, అక్షత, పంచదార మిఠాయిలు సమర్పించాలి. పూజలో 'ఓం సూర్యాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఆదిత్య నమః' అనే మంత్రాన్ని జపించాలి. ఆదివారం రోజు ఇంటి గుమ్మం వద్ద నెయ్యి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. బియ్యం, బెల్లం, పాలు మరియు వస్త్రాలు దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈరోజున మర్రి చెట్టు ఆకుపై మీ కోరికను రాసి ప్రవహించే నీటిలో వేయండి.
Also Read: Saturn Rajayogam 2023: శని గ్రహం రాజయోగాలతో 4 రాశులకు ఊహించని అద్భుతమైన ధనలాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Surya Dev: కన్యా సంక్రాంతి రోజు ఇలా చేస్తే... మీకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..