Morning Upay For Dhanteras 2022: తెలుగు రాష్ట్రాల్లో ధనత్రయోదశికి చాలా విశిష్టత ఉంది. దీపావళి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని ఉత్తరభారతదేశంలో ధంతేరాస్ (Dhanteras) అనే పేరుతో పిలుస్తారు. ఈరోజున షాపింగ్ చేయడం అనవాయితీ. ఈ పండుగ రోజున లక్ష్మీదేవితోపాటు కుబేరుడిని, ధన్వంతరిని పూజిస్తారు. ఈ ఏడాది ధనత్రయోదశి రేపు అంటే అక్టోబరు 23న జరుపుకోనున్నారు. ఈరోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈరోజున తీసుకునే కొన్ని చర్యలు వల్ల మీకు ధనానికి, తిండికి లోటు ఉండదు. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ పండుగ రోజు చేయాల్సిన పరిహారాలేంటో తెలుసుకుందాం.
ధన్తేరస్ రోజున ఈ పరిహారం చేయండి
>> ధంతేరాస్ రోజున తెల్లవారుజామునే లేచి ఇంటి ప్రధాన ద్వారాన్ని ముందుగా శుభ్రం చేయాలి. దీని ద్వారానే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. తలుపు దగ్గర ముగ్గులు వేయడం, మామిడి ఆకులతో గుమ్మానికి తోరణాలు కట్టడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు.
>> ఇంటిని శుభ్రపరిచేటప్పుడు పాత వస్తువులను బయట పడేయండి. పగిలిపోయిన పాత్రలు కూడా ఇంట్లో ఉంచవద్దు.
>> ధంతేరస్ రోజున షాపింగ్ చేస్తున్నప్పుడు, ఎక్కువ కాలం ఉపయోగపడే వస్తువులను కొనండి. కారు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం మరియు వెండి మొదలైనవన్న మాట.
>> ధంతేరస్ రోజు సాయంత్రం ఇంటి బయట పిండితో చేసిన చతుర్ముఖ దీపం వెలిగించడం శ్రేయస్కరం.
>> వీలైతే, ఈ రోజున అవసరమైన వారికి మందులు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: Shukra Gochar 2022: దీపావళికి ముందు ఈ 5 రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా మరి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook