Chaturgrahi Yog in Mesham on 22nd April 2023: కొన్నిసార్లు గ్రహాల స్థానాలు శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఏప్రిల్ నెలలో కొన్ని గ్రహాల ప్రత్యేక కలయిక ఏర్పడబోతుంది. ఈ మాసంలో రాహువు, బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు మేషరాశిలో కలవడం వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశుల వారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
చతుర్గ్రాహి యోగం ఈ రాశులకు వరం
మిథున రాశి: చతుర్గ్రాహి యోగం మిథున రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీ ఆదాయంతోపాటు జీతం కూడా పెరగవచ్చు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. మీరు ఆఫీసులో కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మెుదలైన వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు బెనిఫిట్స్ పొందుతారు.
కర్కాటకం: చతుర్గ్రాహి యోగం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. మీరు పెద్ద పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. సమజాంలో గౌరవం పెరుగుతుంది.
సింహ రాశి: మేషరాశిలో ఏర్పడే చతుర్గ్రాహి యోగం సింహ రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం.
Also Read: Latest Grah Gochar: మేషరాశిలో కలవబోతున్న గ్రహాల రాజు, యువరాజు.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Chaturgrahi Yog on 22nd April 2023: 12 ఏళ్ల తర్వాత చతుర్గ్రాహి యోగం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం