Chanakya Niti Quotes: మన చరిత్రలో చాణక్యుడికి గొప్ప వ్యూహకర్త అని పేరు ఉంది. నిజానికి భారత రాజకీయాలు.. చరిత్ర దశ,దిశను మార్చడంలో చాణక్యుడే ప్రధాన పాత్ర పోషించారు. తన జీవిత కాలంలో ఆయన అద్భుత వ్యూహకర్తగా.. రచయతగా.. సలహాదారుగా.. రాజకీయవేత్తగా వివిధ పాత్రలు పోషించారు. మావన జీవితం గురించి స్వరూప స్వభావాల గురించి ఆయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ప్రయోజనకరంగా ఉంటాయి. ఆచార్య చాణక్యుడిని గొప్ప వ్యూహకర్త అంటారు. నిజానికి భారత రాజకీయాలు, చరిత్ర దిశను మార్చడంలో ఈ ఆచార్య ప్రధాన పాత్ర పోషించారు. తన జీవితకాలంలో ఆయన విధాన సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయవేత్తగా వివిధ పాత్రలు పోషించారు. మానవ స్వభావం, జీవితం గురించి ఆయన చెప్పిన సిద్ధాంతాలు నేటికీ చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి.
మౌర్యల పరిపాలన కాలంలో.. చంద్రగుప్త మౌర్యుడు రాజు కావడానికి ప్రధాన సలహాదారుగా.. రాజనీతిజ్ఞుడిగా,ఆర్ధిక వేత్తగా, భారత తత్త్వవేత్తగా.. గుర్తింపు పొందారు చాణక్యుడు. ఈయన్ని కౌటిల్యుడు అని పిలుస్తారు. నంద వంశాన్ని నాశనం చేసి.. మౌర్య సామ్రాజ్య స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు. రాజకీయం,ఆర్ధికం,జీవితం అనే అంశాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు. వీటిని సువర్ణాక్షరాలుగా భావిస్తారు.
ఇక చాణక్యుడి ప్రధాన ఆలోచనలలో ఒకటైన నీతి, ఒక మనిషి ధనవంతులుగా ఎలా అవుతారో వివరణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కలలు కంటారు. కానీ కొందరు మాత్రమే ఆ కలను నెరవేర్చుకుంటారు.
ఆచార్య చాణక్యుడు భారత దేశపు గొప్ప ఆర్ధిక వేత్త. ఆయన చెప్పిన నీతి సూత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అతను రోజువారీ జీవితానికి కొన్ని సూత్రాలను చెప్పాడు. ఇది సామాన్యులకు జీవించడానికి ప్రేరణనిస్తుంది. జీవితంలో సరైన మార్గాన్ని అనుసరించడానికి వారికి అనేక ఆలోచనలు ఉన్నాయి. చాణక్యుడి ప్రధాన ఆలోచనలలో ఒకటైన నీతి ఏంటో చూద్దాం..
ఒక వ్యక్తి ఎలా ధనవంతుడు అవుతాడో చాణక్య నీతి వివరిస్తుంది. ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కలలు కంటారు. కానీ అందరూ ధనవంతులు కాలేరు. దీని వెనుక ఒకరి కృషి మరియు అదృష్టం ఉంది. దీని గురించి చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు సామాన్యుడు కూడా ధనవంతుడు కావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విషయాల గురించి చెప్పారు. ధనవంతుడు కావాలంటే తన అలవాట్లలో కొన్నింటిని మార్చుకోవాలి, అప్పుడే అతను ధనవంతుల వర్గంలోకి ప్రవేశించగలడు. ధనవంతులు కావడానికి ఎవరైనా మార్చుకోగల రెండు అలవాట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆచార్య చాణక్యుడు ప్రకారం, ధనవంతుడు కావాలంటే తనకున్న దాంట్లో దానం చేస్తూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆశీర్వాదం పొందడం తప్ప మరేమీ ఉండదు. ఆచార్య చాణక్యుడు దానం చేసే వ్యక్తిపై భగవంతుని అనుగ్రహం కురుస్తుందని నమ్ముతారు. కాబట్టి దానం చేయడం వల్ల ఆ వ్యక్తి పేదవాడు కాకుండా ధనవంతుడు అవుతాడు.
పేదలకు దానం చేయండి నేర్చకోవాలని చెప్పాడు.
చాణక్యుడి ప్రకారం, ఏదైనా ధార్మిక కార్యక్రమానికి విరాళం ఇవ్వడం కూడా ఒక వ్యక్తి ఆర్ధిక పరిస్థితి బలపరుస్తోంది. చేసిన ఈ పనిని ఎపుడు గొప్పగా చెప్పుకోవద్దు.
మరొక అలవాటు ప్రకారం, చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి తన డబ్బు గురించి ఎప్పుడూ గర్వపడకూడదంటారు. ఒక వ్యక్తి తన ఆర్థిక స్థితి గురించి గర్వంగా భావిస్తే.. అతని చేతిలో డబ్బు ఎక్కువ కాలం నిలువ ఉండదు. నిజానికి అలాంటి వారిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి ఏదైనా మంచి స్థితిలో పాదాలు నేలపై ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..
ఇదీ చదవండి: ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook