Govinda Nandanandana: మనసును హత్తుకునే భక్తి గీతం.. ‘గోవింద నందననందన’ పాట విడుదల

Govinda Nandanandana Video Song: శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి చాటిచెబుతూ.. రక్షా బంధన్ సందర్భంగా గోవింద నందనందన వీడియో సాంగ్‌ రూపొందించారు కలకత్తా కె.శ్రీవిద్య. తన సోదరుడు మోహన్ కన్నన్ ఈ పాటను అందించడం విశేషం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2023, 01:22 PM IST
Govinda Nandanandana: మనసును హత్తుకునే భక్తి గీతం.. ‘గోవింద నందననందన’ పాట విడుదల

Govinda Nandanandana Video Song: ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, కలకత్తా కె.శ్రీవిద్య తన సోదరుడు, సంగీత స్వరకర్త, గాయకుడు మోహన్ కన్నన్ (అగ్నీ)తో కలిసి తాళ్లపాక అన్నమాచార్య రచించిన గోవింద నందనందన వీడియో సాంగ్‌ను  అందించారు. రక్షా బంధన్ సందర్భంగా ఈ సోదరీ సోదరులు ఈ భజనను అందించటం గమనార్హం. శ్రీవిద్య పాడిన గోవింద నందనందన భజన శ్రీకృష్ణుని ఆవాహన చేస్తుంది. ఇది గోపిక కన్నుల ద్వారా భగవంతుని గురించి తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు బాల్యం, యవ్వనంలో ఎలా ఉండేవాడో ఒక ఉల్లాసభరితమైన భజన రూపంలో తెలుపుతుంది. ఈ గోవింద నందనందన భజన ద్వారా మొదటిసారిగా స్వరకర్త భూమికను కూడా నిర్వహించారు శ్రీవిద్య. 

కలకత్తా కె.శ్రీవిద్యగా ప్రసిద్ధి చెందిన శ్రీవిద్య కర్ణాటక సంగీత విద్వాంసురాలు. గాత్రం, వయోలిన్ రెండింటిలోనూ ఆమె  నిష్ణాతులు. ఆమె తన తల్లి వసంత కన్నన్ నుంచి సంగీతం నేర్చుకుంది. వసంత కన్నన్ ప్రపంచ ప్రఖ్యాత కర్నాటక వయోలిన్ విద్వాంసురాలు. ఈ భజన శ్రావ్యతతో శాస్త్రీయంగా ఉండటమే కాక నూతన తరం శబ్దాలను కూడా మిళితం చేస్తుంది. శ్రీవిద్య కంపోజిషన్‌ చేస్తూ.. గాత్రంలో ప్రధాన భాగాన్ని అందించగా, ఆమె సోదరుడు మోహన్ ఒక స్వరం పాడారు. ఇది పాటపై సాంప్రదాయేతర సంగీత విభాగాన్ని అందించింది. ఇందులో తబలా ప్రధాన భూమిక పోషించింది.  

కోల్‌కతాలోని శ్రీ గురువాయూరప్పన్ ఆలయంలో ఇది శ్రీవిద్య శ్రీకృష్ణునికి పాడే నిర్మలమైన దృశ్యాలతో ఆత్మను హత్తుకునే భక్తి గీతం. ఈ మ్యూజిక్ వీడియో సహజమైన శ్రీ గురువాయూరప్పన్ ఆలయం అందాన్ని ప్రదర్శిస్తుంది. సంగీత స్వరకర్త, గాయకురాలు శ్రీవిద్య గోవింద నందనందన భజన గురించి మాట్లాడుతూ.. “ఇది చాలా సరదాగా ఉంటుంది. చాలా ప్రత్యేకమైనది. గోవింద నందనందన భజన అనేది నాకు కేవలం పాట మాత్రమే కాదు.. దానిని కంపోజ్ చేయడం, పాడడం, షూటింగ్ చేయడం నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నాకు సహాయపడింది. ఈ పాట కోసం నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..” అని తెలిపారు.

శ్రీవిద్య సోదరుడు మోహన్ కన్నన్ మాట్లాడుతూ.. “కోల్‌కతాలోని ఈ ఆలయం కేవలం ఒకే గదిగా ఉన్నపటి నుంచి మా కుటుంబం మొత్తం దానితో అనుబంధం కలిగి ఉంది. శ్రీవిద్య ఎల్లప్పుడూ ఈ ఆలయం, శ్రీకృష్ణుని పట్ల ప్రత్యేక ప్రేమను, గౌరవాన్ని కలిగి ఉంది. ఆమె చెన్నై నుంచి కోల్‌కతాను సందర్శించిన ప్రతిసారీ ఎంత తక్కువ సమయం గడిపినప్పటికీ, శ్రీకృష్ణుని ఆశీర్వాదాన్ని పొందడం ఆమెకు తప్పనిసరి. ఇది జరగడానికి తన వంతుగా కృషి చేసిన శ్రీ వెంకట్రమణన్ మహదేవన్‌కు మేము కృతజ్ఞతలు చెబుతున్నాం..” అని తెలిపారు. 

ఏడేళ్ల వయసు నుంచి మోహన్, శ్రీవిద్య భారతదేశం అంతటా అనేక కర్నాటిక్ క్లాసికల్ కచేరీలలో ప్రదర్శించారు. శ్రీవిద్య పాడటం లేదా వయోలిన్ వాయించడం, మోహన్ మృదంగం వాయించడం చేస్తుంటారు. ఎంతో మంది ప్రేక్షకులను తమ సంగీతంతో అలరించారు.  ఆ వీడియో సాంగ్ ను మీరు చూసేయండి.

 

Trending News