Budhaditya Rajyog in Mesh Rashi 2024: ఏప్రిల్ నెల వచ్చేసింది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ నెలలో కొన్ని గ్రహాలు తమ కదలికలను మార్చుకోబోతున్నాయి. సాధారణంగా సూర్యభగవానుడు ప్రతి నెల రాశిని మారుస్తాడు. ఏప్రిల్ లో కూడా తన రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే అప్పటికే యువరాజైన బుధుడు అదే రాశిలో ఉంటాడు. దీంతో మేషరాశిలో వీరిద్దరి సంయోగం జరగబోతుంది. బుధుడు, సూర్యుడు కలయిక వల్ల అరుదైన బుధాదిత్య రాజయోగం రూపొందుతోంది. ఈ శుభ యోగం నాలుగు రాశులవారికి ఎన్నడూ చూడని లాభాలను ఇస్తుంది.
మేషరాశి
ఇదే రాశిలో బుధాదిత్య రాజయోగం సంభవించబోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. పెళ్లికాని ప్రసాద్ లకు పెళ్లి సంబంధాలు రావచ్చు. విద్యార్థులు మంచిగా చదువుతారు. మీ ఆత్మవిశ్వాసంతో మీరు ఏదైనా సాధిస్తారు. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు.
కర్కాటక రాశి
బుధాదిత్య రాజయోగం కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో మంచి స్థాయికి వెళతారు. వ్యాపారస్తులు పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆగిపోయిన ప్రమోషన్ ఎట్టకేలకు మీకు లభిస్తుంది. మీ అప్పులు తీరిపోతాయి. జాబ్ చేసేవారి శాలరీలు పెరుగుతాయి.
సింహ రాశి
మేషరాశిలో సంభవించబోయే బుధాదిత్య రాజయోగం సింహరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీకు లక్ ఫ్యాక్టర్ ఉంటుది. మీరు డీల్ చేసే ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. మీరు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వారు తిరిగి ఇస్తారు. మీరు పేదరికం నుండి బయటపడే అవకాశం ఉంది.
వృషభ రాశి
సూర్యుడు మరియు బుధుడు కలయిక వృషభరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. వ్యాపారులు ఇంతకముందు ఎన్నడూ చూడని పాప్రిట్స్ ను చూస్తారు. ఈ టైంలో ఎందులోనైనా పెట్టుబడులు పెడితే అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు వేస్ట్ ఖర్చులు తగ్గించుకోండి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Ayodhya Flight: తెలుగు ప్రజలకు శుభవార్త.. అయోధ్యకు ఎంచక్కా ఎగిరిపోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి