Budh Vakri 2022: అక్టోబర్ 2 వరకు తిరోగమనంలో బుధుడు.. లక్కీ, అన్ లక్కీ రాశులివే..!

Budh Vakri 2022: ఇవాళ బుధుడు కన్యారాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. అక్టోబర్ 2 వరకు అదే స్థితిలో ఉంటాడు. దీని ప్రభావం ఏ రాశివారికి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం కలిగిస్తుందో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 10, 2022, 04:37 PM IST
Budh Vakri 2022: అక్టోబర్ 2 వరకు  తిరోగమనంలో బుధుడు.. లక్కీ, అన్ లక్కీ రాశులివే..!

Budh Vakri 2022 Effect: బుధ గ్రహం ఆగస్టు 21న కన్యారాశిలోకి ప్రవేశించింది. ఇవాళ అంటే సెప్టెంబరు 10న అదే రాశిలో తిరోగమనం (Mercury Retrograde in Virgo 2022) చేయబోతుంది. అక్టోబరు 2 వరకు ఇదే స్థితిలో ఉంటుంది. మెర్క్యూరీ తిరోగమనం మెుత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. బుధ గ్రహం ప్రసంగం, తెలివితేటలు, వ్యాపారం మరియు లావాదేవీలకు కారకుడు. బుధ వక్రి కొన్ని రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను అందించనుంది. ఆ స్పెషల్ రాశులేంటో తెలుసుకుందాం. 

ఈ రాశుల వారికి అదృష్టం
బుధుడు తిరోగమనం కారణంగా మేష, సింహ, వృశ్చిక, ధనుస్సు, కుంభ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది.  ఈ రాశుల వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యక్తులు ఉద్యోగ మరియు వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఎక్కడైనా డబ్బు చిక్కుకుపోతే అది మీ వద్దకు చేరుతుంది. 

ఈ రాశుల వారికి దురదృష్టం
సెప్టెంబర్ 10 నుండి అక్టోబర్ 2 వరకు వృషభం, మిథునం మరియు తుల రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు భారీగా డబ్బును నష్టపోవచ్చు. తద్వారా మీ ఆర్థిక పరిస్థితి దిగజారవచ్చు. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టబోతున్నట్లయితే జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి.  ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వ్యక్తులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

ఈ రాశులవారికి సాధారణం
సెప్టెంబర్ 10 నుండి అక్టోబర్ 2 వరకు బుధుడు తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి శుభం లేదా అశుభం ఉండదు. ఈ రాశుల వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది. వీటిలో కర్కాటకం, కన్య, మకరం మరియు మీనం ఉన్నాయి. ఈ సమయంలో ఈ వ్యక్తులు ఆగిపోయిన పనిని పూర్తి చేయవచ్చు.  మీరు పని విషయంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

Also Read: Surya Gochar 2022: కన్యారాశిలో సూర్య సంచారం... ఈ రాశులవారికి అఖండ ఐశ్వర్యం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News