Budh Gochar In November 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాయి. ఈ సంచారం కొందరికి లాభదాయకంగానూ, మరికొందరికి హానికరంగానూ ఉంటుంది. తెలివితేటలు మరియు వ్యాపారాన్ని ఇచ్చే గ్రహం బుధుడు. ఇతడు నవంబరు 13న తులరాశి నుంచి వృశ్చికరాశిలోకి (Mercury transit in Scorpio 2022) ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందడంతోపాటు ఆపారమైన పురోగతిని సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సింహం (Leo): బుధ గ్రహం సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మీ జాతకంలోని నాల్గో ఇంట్లో సంచరిస్తాడు. దీంతో మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అంతేకాకుండా మీరు ఆర్థికంగా పురోగమిస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఇల్లును కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. అంతేకాకుండా తల్లితో మీ సంబంధం బాగుంటుంది.
మిథునరాశి (Gemini): వృశ్చికరాశిలో బుధుడు సంచరించడం వల్ల మిథునరాశి వారికి ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఎందుకంటే ఈ సంచారం మీ జాతకంలో ఎనిమిదవ ఇంట్లో జరగబోతోంది. దీంతో మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మకరం (Capricorn): బుధుడు సంచారం వల్ల మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి 11వ ఇంట్లో సంచరించబోతోంది. దీన్నే ఆదాయం మరియు లాభాల స్థానం అంటారు. దీంతో మీరు షేర్లు, బెట్టింగ్ మరియు లాటరీలలో మంచి డబ్బు సంపాదిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారులకు కొత్త ఆర్డర్లు వస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.
Also read: Mahapurush Rajyog: శనిదేవుడి 'మహాపురుష రాజయోగం'.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook