Planet Transit in February 2023: ఈ ఏడాది ఫిబ్రవరిలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. ఈనెలలో మూడు పెద్ద గ్రహాలైన సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు తమ రాశిని మార్చబోతున్నాయి. ఈ గ్రహాల స్థితి మారడం వల్ల కొన్ని రాశుల వారికి లాభం, కొన్ని రాశులవారికి నష్టం కలిగిస్తాయి. ఫిబ్రవరి నెలలో ఏయే గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయో తెలుసుకుందాం.
బుధ గోచారం
ఫిబ్రవరి నెల ప్రారంభంలో అంటే ఫిబ్రవరి 7, మంగళవారం ఉదయం 7.38 గంటలకు గ్రహాల రాకుమారుడు బుధుడు శనిదేవుడి రాశి అయిన మకరరాశిలో ప్రవేశించనున్నాడు. అప్పటికే గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు.. బుధుడిని ఆహ్వానించడానికి మకరరాశిలో రెడీగా ఉంటాడు. ఫిబ్రవరి 27 వరకు బుధుడు మకరరాశిలోనే సంచరిస్తాడు. మెర్క్యూరీ, సూర్యదేవుడు కలిసి మకరరాశిలో బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తారు. ఈ యోగం ప్రభావం వల్ల మేష, వృషభ, కర్కాటక, కన్యా, తుల, కుంభ రాశులవారి లైఫ్ బిందాస్ గా ఉంటుంది. వీరికి డబ్బుకు లోటు ఉండదు. వ్యాపారంలో బోలెడ్ లాభాలు ఉంటాయి. కెరీర్ అద్భుతంగా నడుస్తోంది.
సూర్య సంచారం
గ్రహాల రాజు సూర్యుడు 2023 ఫిబ్రవరి 13వ తేదీ సోమవారం ఉదయం 9.57 గంటలకు శనిగ్రహ మూల త్రికోణ రాశిలోకి అంటే కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని కుమారుడైన శనిదేవుడు ఇప్పటికే అక్కడ కూర్చుని ఉన్నాడు. కుంభరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉంది.
శుక్రుడి రాశిలో మార్పు
లగ్జరీ, ఐశ్వర్యం మరియు శారీరక సుఖాలకు కారకుడైన శుక్రగ్రహం 2023 ఫిబ్రవరి 15వ తేదీ బుధవారం ఉదయం 8.12 గంటలకు కుంభరాశి నుండి వివాహ రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. బృహస్పతి ఇప్పటికే మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మీనంలో శుక్రుడు మరియు గురు గ్రహ కలయిక ఏర్పడనుంది. ఇది మేషం, వృషభం, కర్కాటకం, మిథునం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం మరియు మీన రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: Shani Ast 2023: జనవరి 30 నుంచి 33 రోజుల ఆ రాశులవారు తస్మాత్ జాగ్రత్త, జీవితంలో ఉహించని సమస్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook