Venus Transit 2022: అరుదైన యోగం చేస్తున్న శుక్రుడు.. వీరి ఆదాయం రెట్టింపు అవ్వడం పక్కా..

Venus Transit 2022: డిసెంబరులో ఏర్పడిన ధనుస్సు రాశిలో లక్ష్మీ నారాయణ యోగం మేషం సహా అనేక రాశుల వారి ఆదాయం పెరుగుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2022, 11:28 AM IST
Venus Transit 2022: అరుదైన యోగం చేస్తున్న శుక్రుడు.. వీరి ఆదాయం రెట్టింపు అవ్వడం పక్కా..

Venus Transit 2022: ఈనెల ప్రారంభంలో శుక్రుడు ధనుస్సు రాశిలో సంచరించాడు. ఈ రాశిలో శుక్రుడు మరియు మెర్క్యూరీ కలయిక వల్ల అరుదైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభఫలితాలను ఇస్తుంది. ఈయోగం శుభప్రభావం కారణంగా డిసెంబరుతోపాటు కొత్త ఏడాదిలో ఈ రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేష రాశి (Aries): ఈ రాశి యెుక్క అదృష్ట స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఏర్పడుతున్న లక్ష్మీ నారాయణ యోగం ఈ రాశివారికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ధనప్రాప్తికి కలుగుతుంది. మీ పనిలో మీరు ముందుకు సాగుతారు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ఫ్యామిలీ మరియు మిత్రుల సపోర్టు మీకు లభిస్తుంది. మీరు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. 

మిధున రాశి (Gemini): డిసెంబరు నెలలో శుక్రుడు మిథునరాశి నుండి ఏడవ ఇంటిలో సంచరిస్తాడు. వీరి తెలివితేటలు, సామర్థ్యం పెరుగుతుంది. ఆఫీసులో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక విషయాలు మీకు లాభిస్తాయి. ఈ సమయంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార, ఆర్థిక విషయాల్లో మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. 

సింహ రాశి (Leo): ధనుస్సు రాశిలో శుక్రుని సంచారం సింహరాశి నుండి ఐదవ ఇంట్లో ఉంటుంది. ఇది చాలా లాభాలను ఇస్తుంది. వీరు తమ తమ రంగాల్లో రాణిస్తారు. హోటల్, టూరిజం, అడ్మినిస్ట్రేటివ్ రంగం, రక్షణ రంగం మరియు క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. సంతానం పొందే అవకాశం ఉంది. 

Also Read: Mercury Gochar 2022: ఇవాళ శనిదేవుడి రాశిలోకి బుధుడు.. వీరు పట్టిందల్లా బంగారమే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News