Laxmi Narayan Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల స్థానం మార్పు వల్ల అనేక యోగాలు మరియు శుభ యాదృచ్ఛికాలు ఏర్పడతాయి. ఈసారి నవంబర్‌లో లక్ష్మీనారాయణ యోగం (Laxmi Narayan Yoga) ఏర్పడుతోంది. ఈ యోగం ఎలా ఏర్పడుతుంది, ఏ రాశుల వారికి ఇది శుభప్రదం. అలాగే దాని ప్రభావం ఏమిటో తెలుసుకుందాం.
లక్ష్మీ నారాయణ యోగం ఎలా ఏర్పడుతుంది?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒకే రాశిలో రెండు గ్రహాలు కలిసినప్పుడు యోగం ఏర్పడుతుంది. నవంబర్ 11న శుక్రుడు వృశ్చికరాశిలోకి, నవంబర్ 13న బుధుడు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. వృశ్చికరాశిలో ఈరెండు గ్రహాల కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.
సింహరాశి (Leo): శుక్ర మరియు బుధ గ్రహాల సంచారం ఈ రాశికి చెందిన వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో ఐశ్వర్యం నెలకొంటుంది. వ్యాపారం మెుదలుపెట్టడానికి ఇది మంచి సమయం. ఫ్యామిలీ సపోర్టుతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius): ఒకే రాశిలో బుధుడు, శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం మంచి లాభాలను ఇస్తుంది. ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే వ్యాపారస్తులు ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులు లాభపడతారు.
మకరరాశి (Capricorn): మకర రాశి వారికి ఈ సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆఫీసులో ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. జీతంలో పెరుగుదల ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కుంభ రాశి (Aquarius): లక్ష్మీనారాయణ యోగం వల్ల మీరు ముందుకు సాగడానికి అనేక అవకాశాలను పొందవచ్చు. కెరీర్‌లో విజయం సాధించవచ్చు. ఇంట్లో ఆనందం నెలకొంటుంది. ఆఫీసులో మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కుతుంది. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
Also Read: Guru Margi 2022: మీనరాశిలో నడవనున్న గురుడు... ఈ 5 రాశులవారికి తిరుగుండదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook