Budh Margi 2023: మే 15న రెండు గ్రహాలు వేరువేరు రాశుల్లోకి సంచారం, ఈ రాశువారిపై తీవ్ర ప్రభావం!

Budh Margi 2023: బుధగ్రహ సంచారం వల్ల చాలా రాశులవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మే 15 నుంచి పలు రాశులవారి జీవితాల్లో తీవ్ర మార్పులు కూడా వస్తాయి. కాబట్టి ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 12, 2023, 01:27 PM IST
Budh Margi 2023: మే 15న రెండు గ్రహాలు వేరువేరు రాశుల్లోకి సంచారం, ఈ రాశువారిపై తీవ్ర ప్రభావం!

Budh Margi 2023: బుధ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో రాకుమారుడిగా పరిగణిస్తారు. అంతేకాకుండా మేధస్సు, తర్కం, సంభాషణ, వ్యాపారానికి సూచికలుగా భావిస్తారు. బుధ గ్రహం రాశిలపై అనుకూలంగా ఉంటేనే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. లేకపోతే తీవ్ర ఆర్థిక నష్టాలతో పాటు సమాజంలో గౌరవం కూడా తగ్గే ఛాన్స్‌ కూడా ఉంది. మే 15 బుధుడు మేషరాశిలో సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ సంచార ప్రభావం అన్ని రాశులవారిపై పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం వల్ల ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై ప్రభావం:
వృషభం:

బుధ గ్రహ సంచారం వృషభ రాశివారిపై కూడా పడబోతోంది. కాబట్టి ఈ రాశివారికి సంచారం చాలా శుభప్రదం కానుంది. వృషభ రాశివారు ఆస్తి సంబంధిత ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా భూమి-భవనం లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు ఈ క్రమంలో కష్టపడి పనులు చేయడం వల్ల సులభంగా వీరు మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read: May Grah Gochar 2023: రాబోయే 18 రోజుల్లో ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా? 

మేషరాశి:
బుధుడు మేషరాశిలోనే సంచారం చేయబోతున్నాడు. కాబట్టి బుధుడి ప్రభావం ఈ రాశివారిపై ప్రత్యేక్షంగా పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందొచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన సేవా కార్యక్రమాలు చేయడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కన్యారాశి:
కన్యారాశి రాశివారిపై కూడా బుధుని సంచార ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఇది అత్యంత ముఖ్యమైన సమయంగా భావించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. అంతేకాకుండా అందుతాయి.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి బుధగ్రహ సంచార ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో నిలిచిపోయిన పనులన్నీ సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ రాశివారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన విజయం తప్పక మీ సొంతమవుతుంది. 

కర్కాటక:
కర్కాటక రాశి వారికి కూడా బుధుని ప్రత్యక్ష సంచార ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కర్కాటక రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి ఈ క్రమంలో చాలా లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారు కార్యాలయంలో ఉన్నత అధికారుల మద్దతు పొందుతారు.

Also Read: May Grah Gochar 2023: రాబోయే 18 రోజుల్లో ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News