Budh Margi 2023: బుధ గ్రహం తిరోగమనంతో ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం, లాభాలే..లాభాలు!

Budh Margi 2023: బుధ గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఊహించని లాభాలు కూడా పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2023, 01:04 PM IST
Budh Margi 2023: బుధ గ్రహం తిరోగమనంతో ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం, లాభాలే..లాభాలు!

 

Budh Margi 2023: బుధ గ్రహం సూర్య గ్రహానికి అతి సమీపంలో ఉండే గ్రహం..అంతేకాకుండా చాలా మంది దీనిని చిన్న గ్రహంగా కూడా పిలుస్తారు. జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. మ్యూనికేషన్, వ్యాపారాలకు సూచికగా పరిగణించే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. బుధుడు సెప్టెంబర్ 16న సింహరాశిలోకి తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారు శుభ ఫలితాలు పొందితే మరికొన్ని రాశులవారు అశుభ ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మిథున రాశి:

బుధుడి ప్రత్యేక్ష తిరోగమనం కారణంగా మిథున రాశివారికి కెరీర్‌లో అద్భుతాలు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో కొత్త ఎత్తులు సాధించడానికి ఎన్నో ప్లాన్స్‌ వేస్తారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో చాలా మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తిని కూడా తిరిగి పొందుతారు. ఈ సమయంలో కొత్త వాహనాలు కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని పనుల్లో తల్లిదండ్రుల మద్దతు లభించి అనుకున్న ఫలితాలు పొందుతారు. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

సింహ రాశి:
బుధుడి ప్రత్యక్ష సంచారం కారణంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఆశించిన ఫలితాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీ జీవితంలో శక్తి స్థాయి పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది..లేకపోతే ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

ధనుస్సు రాశి:
సింహరాశి వారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కెరీర్ మంచి లాభాలు పొందడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలు రాసేవారు ఈ సమయంలో కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి పనుల్లోనేన సులభంగా విజయాలు సాధిస్తారు. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News