Budh Margi 2022: సంచారంలో బుధుడు.. అక్టోబర్ 26 వరకు ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు..

Budh Margi 2022: గ్రహాల యువరాజు బుధుడు ప్రస్తుతం కన్యారాశిలో మార్గంలో ఉన్నాడు. బుధుడి యెుక్క ఈ ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2022, 05:03 PM IST
Budh Margi 2022: సంచారంలో బుధుడు.. అక్టోబర్ 26 వరకు ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు..

Budh Margi 2022: కమ్యూనికేషన్, వ్యాపారం మరియు మేధస్సు మొదలైన వాటికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. సెప్టెంబర్ 10న కన్యారాశిలో బుధుడు తిరోగమించాడు. రీసెంట్ గా అంటే అక్టోబరు 2న బుధుడు ప్రత్యక్ష సంచారంలోకి వచ్చాడు. అక్టోబరు 26 వరకు అదే స్థితిలో ఉంటాడు. బుధుడు మార్గం (Budh Margi 2022) వల్ల ఈ 5 రాశుల జీవితాలు మారనున్నాయి. వీరికి కెరీర్ లో పురోగతి, వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో ఓసారి లుక్కేద్దాం. 

మేషం (Aries)- మేష రాశి వారికి బుధుని మార్గం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి బుధుడు మార్గం వల్ల మేలు జరుగుతుంది. వ్యాపారులు భారీ లాభాలను ఆర్జిస్తారు.  విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. 
వృషభం (Taurus)- వృషభ రాశి వారికి బుధుని ప్రత్యక్ష సంచారం జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీరు కుటుంబ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 
కన్యారాశి (Virgo)- బుధుడు మార్గం వల్ల కన్యారాశి వారు శుభవార్తలు వింటారు. మీ కెరీర్‌లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఊహించని ధనలాభం కలుగుతుంది. 
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి బుధుని మార్గం చాలా లాభాలను ఇస్తుంది.  ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారం చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
మకరం (Capricorn)- బుధుడు యొక్క మార్గం వ్యాపారవేత్తలకు ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్ పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి.

Also read: Surya Gochar 2022: తులరాశిలో సూర్య సంచారం.. ఈ 3 రాశులవారి భవిష్యత్తు మారడం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News