Budh Gochar 2023: బుధ, సూర్య గ్రహాల యుతితో బుధాదిత్య యోగం.. రేపట్నించి ఈ రాశులకు అన్నీ కష్టాలే, సర్వం కోల్పోతారు

Budh Gochar 2023: బుధుడి గోచారంతో 12 రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు బుధ గోచారం శుభ సూచకంగా ఉంటే..ఇంకొన్ని గ్రహాలకు అశుభంగా మారుతుంది. ఈ గోచారంతో ఫిబ్రవరి 7 నుంచి 22 వరకూ ఏ రాశుల జీవితంలో ఇబ్బందులు ఎదురౌతాయో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 8, 2023, 10:23 AM IST
Budh Gochar 2023: బుధ, సూర్య గ్రహాల యుతితో బుధాదిత్య యోగం.. రేపట్నించి ఈ రాశులకు అన్నీ కష్టాలే, సర్వం కోల్పోతారు

Budh Gochar 2023: బుద్ధి, తర్కం, సంచారానికి కారకం బుధుడు. ఫిబ్రవరి 7న మకరరాశిలో బుధుడి రాశి పరివర్తనముంది. ఈ రాశిలో సూర్యుడు ముందు నుంచే ఉండటంతో.. జ్యోతిష్యం ప్రకారం బుధ, సూర్య గ్రహాల యుతితో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

బుధుడి గోచారంతో మొత్తం 12 రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంటుంది. కొన్ని రాశులకు బుధ గోచారం శుభ సూచకంగా ఉంటే.. కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. ఫలితంగా ఫిబ్రవరి 7 నుంచి 22 వరకూ ఫిబ్రవరి వరకూ ఏయే రాశుల జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయో తెలుసుకుందాం...

వృషభ రాశి

ఈ గోచారం కారణంగా వృషభ రాశివారి జీవిత భాగస్వామితో విభేదాలు ఎదురుకావచ్చు. జరుగుతున్న పనులు కూడా నిలిచిపోతాయి. ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి పెట్టకపోతే డబ్బుల విషయంలో నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. మీ వాయిస్ పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవాలి. కోపంతో చేసే పనులు లేదా మాటలు నష్టాలకు కారణమౌతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఆర్ధిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. మీ రహస్యాల్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. అనైతిక పనులకు దూరంగా ఉండాలి. ఈ గోచారంతో మిశ్రమ ఫలాలుంటాయి. మహిళల కారణంగా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు గోచారం కష్టాల్ని తెచ్చిపెడుతుంది. పనిలో ఏ విధమైన ఇబ్బంది ఎదురుకాదు. ఫలితంగా ఆందోళన పెరుగుతుంది. 

వృశ్చిక రాశి

బుధ గోచారం కారణంగా చాలా సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. పనిచేసే చోట అధికారులతో సమస్యలు ఎదుర్కొంటారు. పనిలో కష్టాలు పెరుగుతాయి. గోచారం కాలంలో ఖర్చులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. లేకపోతే అప్పులు తీసుకోవల్సిన దుస్థితి ఏర్పడుతుంది. మీ వాయిస్ నియంత్రణలో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామికి చాలా విషయాలు చెడుగా అన్పించవచ్చు. అతి విశ్వాసంలో ఉండవద్దు.

ధనస్సు రాశి

ఈ గోచారం సమయంలో సోదర సోదరీమణులతో సంబంధాలు పాడవుతాయి. ఈ కాలం మీకు మంచిది కాదు. శత్రువులు మిమ్మల్ని సమస్యలకు గురి చేయవచ్చు. తెలివితేటలతో పనిచేయాల్సి ఉంటుంది. అధికారులు, తోటి ఉద్యోగుల కారణంగా పనిలో ఏకాగ్రత ఉండదు.

మకర రాశి

బుధుడి రాశి పరివర్తనంతో వృధా ప్రయాణాలుంటాయి. డబ్బులు విపరీతంగా ఖర్చవుతాయి. ఇది సమస్యలకు కారణమౌతుంది. విద్యార్ధులకు చదువులో పలు సమస్యలు ఎదురౌతాయి. మతపరమైన పనుల్లో ఏకాగ్రత ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ క్రమంలో తండ్రి సహాయం లభిస్తుంది. 

Also read; Budh gochar 2023: మరో 4 రోజుల్లో ఈ 5 రాశులపై ధనవర్షం, ఉద్యోగంలో పదోన్నతి, అంతులేని లాభాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News