Ayodhya Deepotsav 2023: 24 లక్షల దీపాలతో ధగధగ మెరవనున్న అయోధ్య నగరి, కొత్త ప్రపంచ రికార్డుకు ప్రయత్నం

Ayodhya Deepotsav 2023: దీపావళికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భారీగా దీపోత్సవం నిర్వహించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. వందలు కాదు వేలు కాదు..ఏకంగా 24 లక్షల దీపాలు అయోధ్య నగరిని వెలుగులతో ముంచెత్తనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 11, 2023, 09:03 PM IST
Ayodhya Deepotsav 2023: 24 లక్షల దీపాలతో ధగధగ మెరవనున్న అయోధ్య నగరి, కొత్త ప్రపంచ రికార్డుకు ప్రయత్నం

Ayodhya Deepotsav 2023: దీపావళికి మరి కొద్ది గంటలే మిగిలింది. రాముడి నగరం అయోధ్య లక్షల దీపాలతో సర్వాంగ సుందరంగా మెరుస్తోంది. నవంబర్ 12 మొదటి దీపావళి అయితే..వచ్చే ఏడాది జనవరి 22న రాముని విగ్రహ ప్రతిష్ఠతో రెండవ దీపావళి జరిపేందుకు సిద్ధమౌతోంది. ఈసారి ఏకంగా 24 లక్షల దీపాలతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. అటు మిరుమిట్లు గొలిపే ప్రత్యేక లేజర్ షో అందర్నీ ఆకట్టుకోనుంది. 

అయోధ్యలో అసలు దీపావళి వచ్చే ఏడాది అంటే 2024 జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున కన్పించనుంది. ఇప్పట్నించే అయోధ్య అందుకు ముస్తాబవుతోంది. దీపావళి పురస్కరించుకుని రాముడి నగరం అయోద్య లేజర్ షో ఏర్పాట్లు, లక్షలాది ద్వీపాలతో దేదీప్యమానంగా వెలగనుంది. అయోధ్య చరిత్రలో ప్రపంచ రికార్డుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయోద్య మొత్తం ఇప్పుడు పెళ్లి కూతురిలా ముస్తాబవుతోంది. రామజన్మభూమిపై 24 లక్షల ద్వీపాలు మిరుమిట్లు గొలపనున్నాయి.

అయోధ్యలో ఈసారి దీపావళిని మరింత వైభవంగా, దివ్యంగా మార్చేందుకు మొత్తం నగరాన్ని దీపాలతో నింపి వెలుగులు చిమ్మేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి అయోధ్యలోని 51 ఘాట్లపై ఏకంగా 24 లక్షల ద్వీపాలు వెలిగించి సరికొత్త ప్రపంచ రికార్డు స్థాపించనున్నారు. అయోధ్యలో దీపావళి ప్రతి సారీ ప్రత్యేకమే. ఈసారి మరింత విభిన్నంగా ఉండేందుకు రంగం సిద్ధమౌతోంది. వాస్తవానికి గత ఏడేళ్ల నుంచి అయోధ్యలో ప్రతి దీపావళికి భారీగా దీపోత్సం నిర్వహిస్తూ ప్రపంచ రికార్డు నెలకొల్పుతున్నారు. ఈసారి మరో కొత్త రికార్డు సృష్టించేందుకు ఏకంగా 24 లక్షల దీపాలు వెలగనున్నాయి.

సరయూ నది తీరాన లేజర్ షో ద్వారా శ్రీరాముడి జీవిత చరిత్ర ప్రదర్శించనున్నారు. రష్యా, శ్రీలంక, సింగపూర్, నేపాల్ కళాకారులు దీపోత్సవంలో రామ్ లీలా పఠించనున్నారు. ప్రతి యేటా ఉన్నట్టే ఈసారి కూడా దీపావళి నాడు అయోధ్యలో త్రేతాయుగ దర్శనముంటుంది. సాధు సంతువుల్నించి సామాన్యుల వరకూ ప్రతి భక్తుడు రామమందిర నిర్మాణం పూర్తి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడిక నిరీక్షణ తొలగిపోనుంది. ఒకే సమయంలో 24 లక్షల దీపాలు వెలిగించడమంటే చాలా ప్లానింగ్ అవసరం. ఇందుకోసం వేల సంఖ్యలో వాలంటీర్లు అయోధ్య చేరుకుంటున్నారు. ఒక్క అవద్ యూనివర్శిటీ నుంచే 25 వేలమంది విద్యార్ధులున్నారు. 

ఆదివారం మద్యాహ్నం 3 గంటలకు అయోధ్యలో దీపోత్సవం ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వివిధ దేశాల హై కమీషనర్లు, కేబినెట్ మంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రుల్ని సిద్ధంగా ఉంచారు. 

Also read: Diwali 2023: దీపావళి పండగ రోజే ప్రత్యేక యోగాలు..10 రాశులవారు ఈ వస్తువులను దానం చేస్తే లాభాలే లాభాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News