Ayodhya Prasadam: అయోధ్య రామాలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదమేంటో తెలుసా, అదెలా ఉంటుందంటే

Ayodhya Prasadam: మరి కొద్దిరోజుల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. అయోద్య నూతన రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. ఈ సందర్బంగా అయోధ్య రామాలయంలో ప్రసాదం ఎలా ఉంటుందనేది ఆసక్తి కల్గిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2024, 11:28 AM IST
Ayodhya Prasadam: అయోధ్య రామాలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదమేంటో తెలుసా, అదెలా ఉంటుందంటే

Ayodhya Prasadam: దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ భక్తులకు ప్రసాదం అందుబాటులో ఉంటుంది.  ఒక్కో దేవాలయంలో ఒక్కో ప్రత్యేకమైన ప్రసాదం ఉంటుంది. ఎంతలా ఉంటే ప్రసాదం చూసి ఏ పుణ్యక్షేత్రమో చెప్పేస్తుంటారు. అదీ దేశంలో ప్రసాదాలకు , పుణ్యక్షేత్రాలకు ఉన్న సంబంధం.

ప్రపంచవ్యాప్తంగా హిందూవులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం జనవరి 22వ తేదీన ప్రారంభం కానుంది. దేశ విదేశాల్నించి పెద్ద ఎత్తున వీవీఐపీలు, భక్తులు అయోధ్యకు చేరుకోనున్నారు. అయోధ్య రామాలయం ఇకపై హిందూవులకు అత్యంత పవిత్రమైన దర్శనీయ క్షేత్రం కానుంది. హిందూవుల్లో తిరుపతికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకు మించిన ప్రాచుర్యం అయోధ్య రామాలయం సొంతం చేసుకోనుంది. హిందూవుల ఆరాధ్య దైవం కావడంతో ఈ ఆలయానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడుతోంది. 

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇచ్చే ప్రసాదాలకు ప్రత్యేకత ఉంటుంది. తిరుపతిలో లడ్డూకు, శబరిమలలో అరవాన్నానికి, షిరిడీలో నువ్వులతో చేసే ప్రత్యేక ఆహారం, అన్నవరంలో ప్రత్యేక ప్రసాదం ఇలా ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేక ప్రసాదముంటుంది. ప్రసాదం చూడగానే ఆలయం పేరు చెప్పేస్తుంటారు చాలామంది. అంతలా ఆయా దేవాలయాల ప్రసాదం ప్రాచుర్యం పొందుతుంటుంది. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రసాదంగా ఇప్పటి వరకూ తిరుపతి లడ్డూకు ప్రాధాన్యత ఉంది. ఇప్పుడిక అయోధ్య రామాలయం ప్రసాదం ప్రాచుర్యంలో రావచ్చు. ఇంతకీ అయోధ్య రామాలయంలో భక్తుల వితరణకు ఇచ్చే ప్రసాదం ఏంటి, ఎలా ఉంటుందో తెలుసా..

అయోధ్య నూతన రామాలయంలో అన్నీ ప్రత్యేకమే అయినందున ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదం కూడా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఆయోధ్య రామాలయంలో భక్తులకు ప్రసాదంగా ఇలాచీ దానా ఇవ్వాలని రామ జన్మభూమి తీర్ఘక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఇది యాలుక్కాయలు, చక్కెరతో కలిపి తయారౌతుంది. ఉత్తరాదిన చాలా దేవాలయాల్లో ఈ ప్రసాదం వాడుకలో ఉన్నదే. అయోధ్య రామాలయంలో కూడా ఇదే ప్రసాదాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే రామ్ విలాస్ అండ్ సన్స్ సంస్థకు ఇలాచీ దానా తయారు చేసిచ్చే ఆర్జర్ దక్కింది. 

ఇలాచీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలతో ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనం కలగనుంది. ఇలాచీ ఆరోగ్య ప్రయోజనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇలాచీ ప్రాశస్త్యతను దృష్టిలో ఉంచుకుని ఇలాచీ దానాను ప్రసాదంగా ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇకపై అయోధ్య అంటే ఇలాచీ దానా ప్రసాదం విన్పించనుంది. 

Also read: Lucky Zodiac Signs: నవపంచమి యోగం ప్రభావం, ఆ 4 రాశులకు ఊహించని ధనలాభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News