Ayodhya Route: అయోధ్యకు ఏయే మార్గాల ద్వారా ఎలా చేరుకోవచ్చు, పూర్తి వివరాలు ఇలా

Ayodhya Route: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమీపిస్తోంది. దేశం నలుమూలల్నించి భక్తజనం అయోధ్య చేరుకోనున్నారు. మీరు కూడా అయోధ్య రాముని సందర్శించుకోవాలనుకుంటున్నారా..అయోధ్య ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 17, 2024, 06:58 AM IST
Ayodhya Route: అయోధ్యకు ఏయే మార్గాల ద్వారా ఎలా చేరుకోవచ్చు, పూర్తి వివరాలు ఇలా

Ayodhya Route: జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్నించి భక్తులు అయోధ్యకు తరలిరానున్నారు. జనవరి 22నే కాకుండా ఇక ప్రతి రోజూ అయోధ్యకు చేరుకునే భక్తుల సంఖ్య పెరగనుంది. అసలు అయోధ్యకు ఎలా చేరుకోవాలనేది పరిశీలిద్దాం.

జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ తరువాత జనవరి 23 నుంచి ప్రతిరోజూ సామాన్య భక్తులు అయోధ్య రాముని సందర్శించుకునేందుకు వీలుంటుంది. భక్తుల తాకిడి పెరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీరు కూడా అయోధ్య వెళ్లాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకోండి. అయోధ్య వెళ్లేందుకు విమాన, రోడ్డు, రైలు మార్గాలు మూడూ అందుబాటులో ఉన్నాయి. 

అయోధ్య వెళ్లేందుకు వివిధ రాష్ట్రాల్నించి నేరుగా ఎయిర్ కనెక్టివిటీ ఉంది. ఒకవేళ అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్ లేకుంటే లక్నో, వారణాసి విమానాశ్రయాల్నించి కనెక్టివిటీ ఉంటుంది. అంటే కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా కూడా అయోధ్య వాల్మీకి విమానాశ్రాయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి ట్యాక్సీ ద్వారా రామమందిరానికి చేరవచ్చు. లేదా లక్నో, వారణాసి నుంచి కూడా అయోధ్యకు బస్సు లేదా ట్యాక్సీ ద్వారా వెళ్లవచ్చు. 

రైలు మార్గం ద్వారా కూడా అయోధ్యకు చేరుకోవచ్చు. ఫైజాబాద్ జంక్షన్ లేదా అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా రైల్ కనెక్టివిటీ అయోధ్యకు ఉంది. ఢిల్లీ నుంచి లక్నో మెయిల్, సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నేరుగా అయోధ్యకు ఉన్నాయి. ఢిల్లీ నుంచి అయోధ్య 8-10 గంటల సమయం పడుతుంది. ఇక ముంబై నుంచి వెళ్లాలనుకుంటే లక్నో లేదా వారణాసి జంక్షన్లలో రైలు మారాల్సి ఉంటుంది. కనెక్టింగ్ రైళ్లుంటాయి. కోల్‌కతా నుంచి అయోధ్యకు సీల్దా ఎక్స్‌ప్రెస్, హజార్ దువారీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా అయోధ్యకు వెళ్లవచ్చు. 

ఢిల్లీ, లక్నో, వారణాసి నుంచి అయోధ్యకు బస్సు సర్వీసులు చాలా ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే వోల్వో బస్సులు కూడా నడుపుతున్నాయి. 

Also read: Ayodhya Rammandir Schedule: అయోధ్యలో మొదలైన ముందస్తు క్రతువులు, ఏ రోజు ఏం జరుగుతుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News