Ayodhya Pran Pratishtha Time: దేశంలోనే కాదు ప్రపంచంలోని హిందూవులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం. జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం. ఆ రోజు జరిగే ప్రాణ ప్రతిష్ఠకై ఇప్పటికే రామ్ లల్లా విగ్రహాలు రామమందిరంలోని గర్భగుడికి చేర్చారు. జనవరి 22 వరకూ అంటే మరో 96 గంటలు అయోధ్య రామమందిరంలో జరిగే కార్యక్రమాలేంటో చూద్దాం.
జనవరి 22న జరగాల్సిన ప్రాణ ప్రతిష్ఠకు నాలుగు రోజులు ముందు ఇవాళ బాలరాముడి విగ్రహం రామాలయంలోని గర్భగుడికి చేరుకుంది. 121 మంది పండితులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో మూడ్రోజులు అనుష్ఠాన కార్యక్రమం జరగనుంది. జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇకపై జరగాల్సిన కార్యక్రమాలను శ్రీ రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ అందించింది. ఇవాళ మద్యాహ్నం 1.20 గంటలకు సంకల్పం పూర్తయింది. ఆ తరువాత భక్తి శ్రద్ధలతో రాముడి విగ్రహం, గర్భగుడికి పూజలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గణేశాంబిక పూజ, వరుణ పూజ, చతుర్వేద పుణ్యాహవాచనం, మాతృకాపూజ, వశోర్ధార పూజ, ఆయుష్య మంత్రజపం, నాందీ శ్రద్ధ, ఆచార్యాది చతుర్విత్ విగ్వరణ్, మధుపర్కపూజ, మండప ప్రవేశం వంటి కీలకమైన ప్రక్రియలు జరగనున్నాయి. తరువాత బాలరాముడి విగ్రహానికి నీరు, సుగంధాలలో ముంచి ఉంచుతారు.
గుర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట కోసం తయారు చేయించిన మూడు బాలరాముడి విగ్రహాల్లో మైసూరు చెందిన శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. నల్లని శాలీగ్రామ శిలను చెక్కి ఈ విగ్రహం తయారు చేశారు. ఈ విగ్రహం పొడవు 51 ఇంచెస్. ఎందుకంటే ఐదేళ్ల రాముడి విగ్రహం. ఆ వయస్సులో ఎత్తు దాదాపుగా ఉంతే ఉంటుంది. సనాతనంలో 51ని శుభ సంఖ్యగా భావిస్తారు.
ఐదేళ్ల బాలుడి రూపంలోని రాముడు సుందరంగా, దివ్యంగా, మనోహరంగా కన్పిస్తున్నాడు. ధనస్సు ధరించి నిలుచుని ఉన్న భంగిమలో విగ్రహం ఇది. ఈ విగ్రహం బరువు దాదాపుగా 200 కిలోలుంటుంది.
Also read: Udayanidhi Stalin: మరోసారి సంచలనం రేపిన స్టాలిన్, రామమందిరంపై కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook