Mauni Amavasya 2024: మౌని అమావాస్య రోజు ఈ 4 రాశులకు పట్టిన దరిద్రం పోతుంది.. ఇక నుంచి అన్నీ మంచి శకునలే..

Mauni Amavasya 2024 date: ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే అమావాస్యనే మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈరోజున కొన్ని రాశులకు అదృష్టం పట్టనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 04:15 PM IST
Mauni Amavasya 2024: మౌని అమావాస్య రోజు ఈ 4 రాశులకు పట్టిన దరిద్రం పోతుంది.. ఇక నుంచి అన్నీ మంచి శకునలే..

Mauni Amavasya 2024 effect on Zodiac Signs: హిందు మతంలో అమావాస్య మరియు పౌర్ణమిలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇందులో మౌని అమావాస్య కూడా ఒకటి. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే అమావాస్యనే మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజు పవిత్ర నదుల్లో స్నానం చేయడంతోపాటు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. మౌని అమావాస్య నాడు మౌనవ్రతం పాటించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన మౌని అమావాస్య జరుపుకోనున్నారు. ఫిబ్రవరి 8న అంటే మౌని అమావాస్యకు ఒకరోజు ముందు బుధ గ్రహం మకరరాశిలో అస్తమించబోతుంది. ఇది మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాలుగు రాశులవారికి కలిసి రానుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మకరరాశి
మకరరాశిలో బుధుడు అస్తమించడం వల్ల మేషరాశికి చెందిన విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. మీరు వృత్తిపరమైన సమస్యల నుండి బయటపడతారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు కారు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
కన్యా రాశి
కన్యా రాశి వారు మానసిక ప్రశాంతతను పొందుతారు. వ్యాపారం చేసే వ్యక్తులు చాలా లాభపడతారు. మీకు పదవి లభించడంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. 
వృషభ రాశి 
ఫిబ్రవరి 8న మకరరాశిలో బుధుడు అస్తమించడం వల్ల వృషభ రాశి వారి కెరీర్ బాగుంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీరు అనారోగ్యం నుంచి బయటపడతారు. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. 
కర్కాటక రాశి 
బుధుడి గమనంలో మార్పు వల్ల కర్కాటక రాశి వారు చాలా లాభాలను పొందుతారు. మీరు ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. 

Also Read: Trigrahi Yog 2024: కుంభరాశిలో అద్భుత యోగం... ఈ 3 రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి..

Also Read: Chandra Grahan 2024: హోలీ రోజే చంద్రగ్రహణం.. లాభపడనున్న రాశులు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News