మీ కుండలిలో బుధుడు బలహీనంగా ఉన్నా లేదా బుధ దోషమున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని ఉపాయాల ద్వారా బుధుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అంతా శుభమే జరుగుతుంది.
గ్రహాల్లో బుధుడిని రాజకుమారుడిగా భావిస్తారు. బుధుడిని గౌరవ మర్యాదలు, బుద్ధి, వాయిస్‌కు ప్రతిరూపంగా చెబుతారు. జ్యోతిష్యం ప్రకారం ఎవరిదైనా జాతకం కుండలిలో బుధగ్రహం బలంగా ఉంటే..జీవితంలో చాలా సాఫల్యం లభిస్తుంది. వారి మాటలతో జనాన్ని కట్టిపడేసే శక్తి ఉంటుంది. ఇలాంటి జాతకం వ్యాపారం, కెరీర్ రెండింట్లోనూ విజయాన్ని అందిస్తుంది. కానీ ఒకవేళ కుండలిలో బుధుడు బలహీనంగా ఉంటే..చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. మీ కుండలిలో కూడా బుధుడు బలహీనంగా ఉంటే లేదా ఏదైనా దోషముంటే..ఆందోళన చెందవద్దు. బుధుడిని ప్రసన్నం చేసుకునే ఉపాయాలున్నాయి.
బుధుడిని ప్రసన్నం చేసుకునే ఉపాయాలు
బుధవారం నాడు ఆవుకి పచ్చిగడ్డి మేత వేయాలి లేదా దానం చేయాలి. ఒకవేళ బుధవారం నాడు కిన్నరులకు మీకు తోచినంత డబ్బులిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. పొరపాటున కూడా కిన్నరులకు కోపం తెప్పించకూడదు. బుధవారం నాడు తులసి మొక్క నాటి ప్రతిరోజూ సేవ చేయాలి. బుధవారం రోజు పచ్చరంగు వస్త్రాలు ధరించాలి. ఇది సాధ్యం కాకపోతే కనీసం పచ్చరంగు రుమాలు ధరించాలి. బుధవారం రోజు దుర్గామాత ఆలయంలో పచ్చరంగు గాజులు తొడిగించాలి. సాధ్యమైతే 9మంది కన్యలకు పచ్చరంగు బట్టలు బహుమతిగా ఇవ్వాలి.
గణేశుని ఆలయంలో పచ్చరంగు వస్త్రంలో పచ్చ పెసలు కట్టి బుధుడి కటాక్షం కోసం ప్రార్ధించాలి. బుధవారం రోజు ఓం బు బుధాయ నమ మంత్రాన్ని జపించాలి. బుధుడికి సంబంధించిన దోషాలు దూరం చేసేందుకు బుధవారం రోజున మట్టి కుండను ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి.
Also read: Astrology Facts: ప్రతి రోజూ మీకు ఇలా పక్షులు కనిపేస్తే.. జీవితాంతం డబ్బే.. డబ్బు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook