Surya Mahadasha Effect: 6 ఏళ్లపాటు ఉండే సూర్య మహాదశ.. దాని ప్రభావం ఎలా ఉంటుందంటే.. ఇవీ పరిహారాలు

Surya Mahadasha Effect:  ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్య భగవానుడి మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది. మానవ జీవితంపై దాని ప్రభావం మరియు నివారణ గురించి తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 05:41 PM IST
Surya Mahadasha Effect: 6 ఏళ్లపాటు ఉండే సూర్య మహాదశ..  దాని ప్రభావం ఎలా ఉంటుందంటే.. ఇవీ పరిహారాలు

Surya Mahadasha Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నవగ్రహాల స్థితి మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జాతకంలో గ్రహాల స్థానం బట్టి వ్యక్తి యెుక్క జీవితం ఆధారపడి ఉంటుంది. జాతకంలో ఫ్లానెట్స్ శుభ స్థానంలో ఉంటే వారు మంచి ఫలితాలను పొందుతారు. గ్రహం అశుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతికూల ఫలితాలను పొందుతారు. సమాజం, గౌరవానికి కారకుడు సూర్యభగవానుడు (Surya Dev). గ్రహాల రాజు అయిన సూర్యుడు సింహరాశికి అధిపతి.  అతడు మేషరాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. సూర్యుడు తులరాశిలో బలహీన స్థితిలో  ఉంటాడు. సాధారణంగా సూర్యభగవానుడు మహాదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది.  

జాతకంలో సూర్యభగవానుడు శుభస్థానంలో ఉన్న వ్యక్తి అనేక ప్రయోజనాలు పొందుతారు.  అంతేకాకుండా వీరు తండ్రితో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం సులువుగా వస్తుంది. వ్యక్తి కుండలిలో సూర్యభగవానుడు అశుభంగా ఉంటే అతడు అహంకారం మరియు కోపంతో ఉంటాడు. అలాగే తండ్రితో ఉన్న సంబంధం చెడిపోతుంది. మిమ్మిల్ని అనేక వ్యాధులు చుట్టుముడతాయి. 

ఈ పరిహారం చేయండి
1- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు రాగి, గోధుమలను దానం చేయాలి.
2- ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి.
3- ప్రతిరోజూ ఓం హ్రాన్ హ్రీం హ్రౌంసః సూర్యాయ నమః సూర్య భగవానుని బీజ్ మంత్రాన్ని జపించాలి.
4- ఆదివారం నాడు సూర్యాస్తమయం తరువాత పీపల్ చెట్టు క్రింద నాలుగు ముఖాల దీపం వెలిగించండి.

Also read: Budh Gochar 2022: వృశ్చికరాశిలోకి ఎంటర్ అవ్వనున్న బుధుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Saturn PlanetShani Gochar 2022Saturn Transit In Aquarius 2022

Trending News