Lucky Zodiac Signs: లక్ష్మీదేవికి ఇష్టమైన నాలుగు రాశులు ఇవే.. వీరికి దేనికీ లోటు ఉండదు..

Astrology: సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం నాలుగు రాశులవారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. వీరికి దేనికీ లోటు ఉండదు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 8, 2023, 10:25 AM IST
Lucky Zodiac Signs: లక్ష్మీదేవికి ఇష్టమైన నాలుగు రాశులు ఇవే.. వీరికి దేనికీ లోటు ఉండదు..

Lucky Zodiac Signs: హిందూమతంలో లక్ష్మీదేవిని సంపదల దేవతగా పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. మెుత్తం 12 రాశులలో 4 రాశులవారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంది. వీరు ఎల్లప్పుడూ సంపద, ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటారు.  ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మీనం: మీన రాశి వారిపై కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. మీ ఇంట్లో ఆనందంతోపాటు ఐశ్వర్యం వెల్లివిరిస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మీరు ఎలాంటి పనినైనా సులభంగా పూర్తిచేస్తారు. 
వృషభం: వృషభరాశి వారు చాలా తెలివైనవారు. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. అదృష్టంతో మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

Also Read: Surya Grahan 2023: రెండో సూర్యగ్రహణం ఎప్పుడు? ఎక్కడెక్కడ కనిపిస్తుంది?

ధనుస్సు: ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. దీని కారణంగా మీరు అపారమైన సంపదను పొందుతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీపై లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. 
కర్కాటకం: కర్కాటక రాశి వారికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు లైఫ్ లో దేనికీ లోటు ఉండదు. అనుకున్న సమయానికి మీ పనులను పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 

Also Read: Mercury Mars transit: మరో మూడు రోజుల్లో ఈ 4 రాశుల సుడి తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించలేదు.)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News