Astrology - February: ఫిబ్రవరిలో 4 కీలక గ్రహాల మార్పు.. ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..

astrology - february: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక ఫిబ్రవరిలో 4 గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకోబోతున్నాయి. రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు రాశుల మార్పు కారణంగా కొన్ని రాశుల వారు నక్కతోక తొక్కినట్టే.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 31, 2024, 02:34 PM IST
Astrology - February: ఫిబ్రవరిలో 4 కీలక గ్రహాల మార్పు.. ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..

astrology - february: ఫిబ్రవరిలో నవగ్రహాల్లో కీలకమైన రవి, కుజుడు, శుక్రుడు, శని, బుధ గ్రహాల తమ గమనాన్ని మార్చుకుంటున్నాయి. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. బుధుడు ఫిబ్రవరి నెల ప్రారంభంలో తన రాశిని మార్చుకుంటున్నాడు. ఫిబ్రవరి 5 అంగారకుడు.. దీని తర్వాత శనిదేవుడు కుంభరాశిలోకి అస్తమించబోతున్నాడు. ఫిబ్రవరి 12న శుక్రుడు.. ఫిబ్రవరి 13న సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.

ఆయా రాశుల గమనం ఆధారంగా కొన్ని రాశుల వారికి అదృష్టం బంక పట్టినట్టు పట్టనుంది. సూర్య, కుజ, శుక్ర మరియు బుధ రాశి మార్పు కారణంగా ఏయే రాశుల వారికీ అద్భుతమైన ప్రయోజనం చేకూరనుందో చూద్దాం..

మేష రాశి...
సూర్యుడు, కుజుడు, శని దేవుడు, శుక్ర మరియు బుధ గ్రహాల సంచారం ఈ రాశి వారికీ లాభదాయకంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికీ మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అంతేకాదు సంపాదించే ధనంలో కొంత పొదుపుపై కూడా శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై శ్రద్ధ పెట్టాలి.

ధనుస్సు రాశి:
రవి, అంగారకుడు, శని, శుక్రుడు మరియు బుధ గ్రహాల కదలిక ధనుస్సు రాశి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్‌లో, మీరు మీ యజమాని నుండి పూర్తి మద్దతు పొందుతారు. అనేక కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ ఆదాయం పెరుగుదలపై శ్రద్ద వహించండి. మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు ఆర్ధికంగా ప్రయోజనాలు కలిగిస్తాయి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటే బెటర్.

మకర రాశి:
మకర రాశి వారికి సూర్య, కుజ, శని,శుక్ర, బుధ గ్రహాల సంచారం వల్ల అత్యధిక ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పటికీ, కొన్ని హెచ్చు తగ్గులు కూడా కనిపిస్తాయి. ఆలోచించిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Media దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News