October Grah Gochar 2022: అక్టోబరులో అంతరిక్షంలో అల్లకల్లోలం...రాశిని మార్చబోతున్న 5 గ్రహాలు..

October 2022 Planet Changes: అక్టోబర్ నెలలో 5 గ్రహాలు తమ రాశిచక్రాన్ని మారుస్తున్నాయి. దీంతోపాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2022, 09:25 AM IST
October Grah Gochar 2022: అక్టోబరులో అంతరిక్షంలో అల్లకల్లోలం...రాశిని మార్చబోతున్న 5 గ్రహాలు..

Planet Transits in October 2022 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలోనే దసరా, ధనత్రయోదశి, దీపావళి, కర్వా చౌత్ వంటి ముఖ్యమైన పండుగలు వస్తున్నాయి. అంతేకాకుండా సూర్యగ్రహణం కూడా ఈ నెల చివరిలోనే వస్తుంది. అక్టోబరులో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడి మరియు శని స్థానాల్లో పెను మార్పు రాబోతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. ఏయే గ్రహాలు ఏయే రాశుల్లో సంచరించనున్నాయో తెలుసుకుందాం. 

ఈ నెల మెుదట్లో బుధుడు కన్యారాశిలో తిరోగమనం నుంచి మార్గంలోకి వస్తాడు. తర్వాత  అంగారకుడు మిథునరాశిలో, సూర్యుడు, శుక్రుడు తులరాశిలో సంచరిస్తారు. అనంతరం శని మకరరాశిలో తిరోగమనం నుంచి మార్గంలోకి వస్తాడు. తర్వాత బుధుడు తులరాశిలో సంచరించగా... మిథునరాశిలో కుజుడు తిరోగమిస్తాడు.

అక్టోబరులో జరగునున్న గ్రహ సంచారాలు..
కన్యారాశిలో బుధుడు - అక్టోబర్ 2, 2022
మిథునరాశిలో అంగారక సంచారం -16 అక్టోబర్ 2022
తులారాశిలో సూర్య సంచారం - 17 అక్టోబర్ 2022
తులా రాశిలో శుక్ర సంచారం - 18 అక్టోబర్ 2022
మకర రాశిలో శని సంచారం - 23 అక్టోబర్ 2022
సూర్యగ్రహణం - 25 అక్టోబర్ 2022
తులా రాశిలో బుధ సంచారం - 26 అక్టోబర్ 2022
మిథునరాశిలో కుజుడి తిరోగమనం - 30 అక్టోబర్ 2022

Also Read: Budh Margi 2022: దసరాకి 3 రోజుల ముందు భారీ మార్పు.. ఈ 5 రాశులవారి ఇంట్లో డబ్బే డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News