Holi 2023: హోలీ తర్వాత మేషంలో రాహు-శుక్రుడి కలయిక.. ప్రతి రంగంలోనూ ఈరాశులకు విజయమే ఇక..

Astrology: త్వరలో మేషరాశిలో రాహువు మరియు శుక్రుడు కలయిక ఉండబోతుంది. దీని వల్ల 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 12:52 PM IST
  • శుక్రుడి గమనంలో త్వరలో మార్పు
  • మేషంలో రాహువుతో జతకట్టనున్న వీనస్
  • ఈ రాశులను వరించనున్న అదృష్టం
Holi 2023: హోలీ తర్వాత మేషంలో రాహు-శుక్రుడి కలయిక.. ప్రతి రంగంలోనూ ఈరాశులకు విజయమే ఇక..

Shukra And Rahu Yuti 2023: గ్రహాలు కాలానుగుణంగా తమ గమనాన్ని ఛేంజ్ చేస్తూ ఉంటాయి. హోలీ తర్వాత అంటే మార్చి 12న మేషరాశిలో శుక్రుడు మరియు రాహు గ్రహాల కలయిక ఏర్పడబోతుంది ఈ రెండు గ్రహాల కలిసి ఏప్రిల్ 6 వరకు ఉంటుంది. వీటి సంయోగం ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై పడుతుంది. వీటి కాంబో ఏయే రాశులవారికి అదృష్టాన్ని తెస్తుందో తెలుసుకుందాం. 

శుక్ర-రాహు కలయిక ఈ రాశులకు శుభప్రదం
మీన రాశిచక్రం
శుక్రుడు మరియు రాహువు కలయిక మీన రాశి వారికి మంచి చేస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ యాటిట్యూడ్ తో ప్రజలందరినీ ఆకట్టుకుంటారు. అయితే శని సడేసతి కారణంగా మీరు ఆనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. 
తులా రాశిచక్రం
రాహువు మరియు శుక్రుడు కలయిక మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంటిలో ఈ కూటమి ఏర్పడుతోంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మంచి లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఆఫీసులో పురోగతి ఉంటుంది. 
మిథునం 
రాహు మరియు శుక్రుల కలయిక మిధున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో 11వ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారాల్లో అదృష్టం కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల మీరు లాభాలను పొందుతారు. వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. షేర్లు, బెట్టింగ్ మరియు లాటరీలలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. 

Also Read: Saturn Rise: శనిదేవుడి రైజింగ్ తో ఈరాశులకు అదృష్టం పట్టనుంది... ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News