Astro and Zodiac Sign Tips: పెళ్లికి ముందు జాతకంలో ఏం చూస్తారు. ఏ రాశికి ఏ రాశితో కుదురుతుంది

Astro and Zodiac Sign Tips: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశుల్ని బట్టి వ్యక్తి జాతకం ఉంటుంది. రాశిని బట్టే ఆ వ్యక్తి జీవితంలో ప్రతి భాగం ఆధారపడి ఉంటుంది. అన్ని రాశులకు అన్ని రాశులతో సరిపడదు. మరి ఏ రాశికి ఏ రాశితో కలుస్తుందనేది పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 14, 2022, 12:02 AM IST
Astro and Zodiac Sign Tips: పెళ్లికి ముందు జాతకంలో ఏం చూస్తారు. ఏ రాశికి ఏ రాశితో కుదురుతుంది

హిందూమతంలో జ్యోతిష్యానికి అధిక ప్రాధాన్యత ఉంది. రాశుల్ని బట్టి వ్యక్తి సర్వస్వాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్ల వ్యవహారంలో రాశుల మ్యాచింగ్ తప్పకుండా చూస్తుంటారు. ఆ వివరాలు మనమూ తెలుసుకుందాం..

హిందూమత ఆచారాల ప్రకారం రాశి చూడకుండా ఏ పనీ ప్రారంభించరు. రాశిని బట్టి వ్యక్తిత్వమే కాకుండా అన్ని సీక్రెట్ విషయాలు తెలిసిపోతుందంటారు. ఎందుకంటే..ప్రతిరాశికి గురుగ్రహం ఒకటుంటుంది. ఆ ప్రభావం ఆ రాశి జాతకులపై స్పష్టంగా కన్పిస్తుంది. గ్రహాల మధ్య శతృత్వం, మిత్రత్వం ఉన్నట్టే..రాశుల మధ్య కూడా అదే పరిస్థితి ఉంటుంది. అందుకే పెళ్లి సమయంలో రాశుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరకమంటారు జ్యోతిష్యలు. మీరు పెళ్లి చేసుకోవల్సిన జీవిత భాగస్వామి రాశి గ్రహాల మధ్య శత్రుత్వముంటే..జాతకాలు కూడా కలవవు. కుండలి మ్యాచింగ్‌తో పాటు రాశులు కూడా కలవాల్సిందే. పెళ్లి లేదా ప్రేమ వ్యవహారాల్లో ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఉంటుంది, ఏ రాశికి ఏ రాశి సరైందనే వివరాలు తెలుసుకోవాలి.  

ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి మిధునం, తుల రాశి వారితో మంచి సంబంధాలు కొనసాగగలవు. ఇక వృషభ రాశివారికి మకరం, వృశ్చికంతో మంచి జీవిత భాగస్వామ్య సంబంధాలుంటాయి. మిధున రాశివారికి వృషభం తుల, సింహ రాశులతో మంచి సంబందాలుంటాయి. మిత్రత్వం కొనసాగుతుంది. 

ఇక కర్కాటక రాశివారికి సింహం, మేషం, ధనస్సు రాశివారు మంచి జీవిత భాగస్వాములు కాగలరు. సింహరాశివారికి ధనస్సు రాశి జాతకం చాలా మంచిది. ధనస్సు రాశితో పాటు కర్కాకటం, మేషం, వృశ్చికం, మీన రాశుల్నించి కూడా జీవిత భాగస్వామి ఎంపిక చేయవచ్చు. ఇక కన్యా రాశివారికి మకరం లేదా వృషభ రాశి జాతకులు మంచి జీవిత భాగస్వాములౌతారు. 

తుల రాశివారికి కుంభరాశి జాతకులు బెస్ట్ పార్టనర్ అవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మేషం, మిధున, కన్యా, మకర రాశుల్నించి కూడా జీవిత భాగస్వామి ఎంచుకోవచ్చు. వృశ్చిక రాశివారికి వృషభం, ధనస్సు, కర్కాటకం, మీన రాశివారు మంచి జీవిత భాగస్వాములు అవుతారు. ధనస్సు రాశివారికి సింహం, మేష రాశి జాతకులైతే మంచి జీవిత భాగస్వామ్యులౌతారు. మకర రాశివారికి వృశ్చిక రాశివారు మంచి భాగస్వాములౌతారు. వృషభం, మిధున, కర్కాటకం, తుల రాశి వారితో మంచి సంబంధాలుంటాయి. కుంభ రాశివారు సింహం, వృషభం రాశి వారితో మంచి సంబంధాలుంటాయి. మీనరాశివారికి కర్కాటం, మేషం, వృశ్చిక రాశివారికి జీవిత భాగస్వామిలౌతారు. 

ముఖ్యంగా పెళ్లి సంబంధాలకు ముందు ఇలా రాశుల మ్యాచింగ్ తెలుసుకుంటే చాలంటున్నారు జ్యోతిష్య పండితులు. రాశుల మ్యాచింగ్ తెలుసుకుని కొనసాగితే ఆ బంధాలు కలకాలం ఉంటాయనేది నమ్మకం. 

Also read: Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఏది ఎక్కడుండాలి, వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News