Shani Rahu effect: మీరు చేసే ఈ పనులు శని-రాహువులకు కోపం తెప్పించవచ్చు, నివారణ కోసం ఇలా చేయండి..

Shani Rahu effect; శని, రాహువులకు కోపం వస్తే మనిషి జీవితం కష్టతరమవుతుంది. వీరి యెుక్క చెడు ప్రభావాలను నివారించడానికి ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2023, 04:53 PM IST
Shani Rahu effect: మీరు చేసే ఈ పనులు శని-రాహువులకు కోపం తెప్పించవచ్చు, నివారణ కోసం ఇలా చేయండి..

Shani Rahu ke Upay: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల స్థానంలో చిన్న మార్పు కూడా ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. జాతకంలో ఉన్న శుభ మరియు అశుభ గ్రహాలు వ్యక్తి యెుక్క విజయాలు మరియు వైఫల్యాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో కొన్ని గ్రహాలు మీ కుండలిలో బలహీన స్థితిలో ఉండటం వ్లల అవి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మీ జాతకంలో రాహు, శని బలహీన స్థితిలో ఉండంట వల్ల మీరు అనేక ఇబ్బందులకు గురవుతారు. అయితే ఏ కారణం చేతనైనా సరే మీరు శని మరియు రాహువులకు కోపం తెప్పించే ఇలాంటి పనిని చేయకండి. 

శని-రాహువు చెడు ప్రభావం
>> మీ జాతకంలో శని, రాహువు బలహీనంగా ఉంటే మీరు జీవితంలో మళ్లీ మళ్లీ మోసపోవాల్సి వస్తుంది. మీ సన్నిహితులే మీకు శత్రువులుగా మారతారు.
>> మీ కుండలిలో శని లేదా రాహువు చెడు స్థితిలో ఉంటే మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. 
>> చెడు శని లేదా రాహు వక్ర దృష్టి వల్ల మిమ్మిల్ని వ్యాధులు చుట్టముడతాయి. మీ జీవితమంతా దుఖమయం అవుతుంది. అందుకే ఈ రెండు గ్రహాల యొక్క అశుభ ప్రభావాలను అంతం చేయడానికి ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. 

శని, రాహులు కోపానికి కారణమేంటి?
జాతకంలో శని మరియు రాహువు అశుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ఈ రెండు గ్రహాల కోపాన్ని భరించవలసి ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసిన చెడు పనులు కూడా వారికి ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. ముఖ్యంగా నిస్సహాయులు, పేదలు, కష్టపడి పనిచేసే వ్యక్తులను వేధించడం లేదా దోపిడీ చేయడం, స్త్రీలు, పిల్లలు మరియు వికలాంగులను అవమానించడం శనికి కోపం తెప్పిస్తుంది. కుక్కను వేధించడం, బాత్‌రూమ్‌ను అపరిశుభ్రంగా ఉంచడం, ఇంటి మెట్లను తప్పుగా చేయడం వంటివి రాహువు ఆగ్రహానికి కారణమవుతాయి. కాబట్టి ఈ తప్పులను చేయకండి. 

Also Read: Shani Dev: ఈ పనులతో శనిదేవుడిని ప్రసన్నం చేసుకోండి, లేకపోతే మీకు కష్టాలు తప్పవు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News