Lucky Zodiac Signs 2023: పుట్టుకతోనే కుబేరుడి కటాక్షాన్ని పొందిన రాశులు ఇవే.. వద్దన్న డబ్బు వీరి సొంతం!

Lucky Zodiac Signs 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో జరిగే ప్రతి ప్రక్రియకు ఓ మహత్యముంటుంది. ప్రాధాన్యత ఉంటుంది. అందుకే 12 రాశులకు వేర్వేరు విశిష్టతలుంటాయి. కొన్ని అదృష్ట రాశులైతే మరి కొన్ని దురదృష్ఠరాశులుగా ఉంటాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 3, 2023, 06:19 PM IST
Lucky Zodiac Signs 2023: పుట్టుకతోనే కుబేరుడి కటాక్షాన్ని పొందిన రాశులు ఇవే.. వద్దన్న డబ్బు వీరి సొంతం!

Lucky Zodiac Signs: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని రాశులను చాలా లక్కీ రాశులుగా పరిగణిస్తారు. ఎంత అదృష్టమంటే కుబేరుడి కటాక్షం ఈ రాశులపై సదా ఉంటుందంటారు. జీవితంలో ఎప్పుడూ డబ్బుుకు కొదవ ఉండదు.  ఆ అదృష్ట రాశుల గురించి పూర్తి వివరాలు ఇలా ..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశులు 12. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడానే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తారు. దీనివల్ల అన్ని రాశులపై ప్రభావం పడినా..కొన్ని రాశులకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుంది. అదే విధంగా కొన్ని రాశులను జ్యోతిష్యం ప్రకారం లక్కీ రాశులుగా పిలుస్తారు.

ఈ రాశుల జాతకులు వ్యాపారంలో చాలా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులైతే పేరు ప్రఖ్యాతులు పొందుతారు. కొన్ని రాశులైతే ఆర్ధికంగా చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఈ జాతకులపై కుబేరుడి కటాక్షం ఉంటుందంటారు. జీవితంలో ప్రతి రంగంలోనూ విజయం లభిస్తుంది. డబ్బులు వద్దన్న కొద్దీ వచ్చి పడుతుంటాయి. ధనవంతుల రాశిగా చెబుతారు. 

Also Read: Odisha Train Accident Update: ఘోరకలిలో 233కు చేరుకున్న మృతుల సంఖ్య, ఇంకా పెరగనుందా

కర్కాటక రాశి

కుబేరుడి కటాక్షం సదా ఉండే రాశి కర్కాటక రాశి. ఈ రాశి జాతకులు పుట్టుకతోనే బుద్దిమంతులు, కష్టజీవులే కాకుండా నిజాయితీపరులు కూడా. ప్రతి పని చాలా శ్రద్ధతో చేస్తారు. ఆర్ధికంగా చాలా పటిష్టమైన స్థితిలో ఉంటారు. డబ్బులకు ఎప్పుడూ కొదవ ఉండదు. వద్దంటే డబ్బు వచ్చి పడుతుంటుంది. జీవితంలో అదృష్టం ఎప్పుడూ తోడుగా నిలుస్తుంది. అందుకే ప్రతిరంగంలో విజయబావుటా ఎగురవేస్తారు. ఈ రాశివారికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య ఉండదు. చాలా చలాకీగా ఉంటారు. అన్నింటిలో ముందు వరుసలో నిలబడగలరు. ఇతరుల పట్ల కూడా అంతే సానుకూలంగా ఉంటారు. 

తుల రాశి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కుబేరుడి కటాక్షం కారణంగా తులా రాశి జాతకులు ప్రపంచంలో ప్రతి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదంటారు జ్యోతిష్య పండితులు. అందరితో ప్రేమగా ఉంటారు. ఎవరినీ గాయపరిచే లేదా బాధపెట్టే మనస్తత్వం కాదు. జీవితంలో ఏదైనా పొందాలనుకుంటే సాధించి తీరుతారు. ఆర్ధికంగా చాలా బలమైన స్థితిలో ఉంటారు. నలువైపుల్నించీ ఆదాయం వచ్చి పడుతుంటుంది. జీవితంలో చాలా ఎక్కువగా సంపాదిస్తారు. ఏ విధమైన అనారోగ్య సమస్యలుండవు. వ్యాపారంలో ఉండేవాళ్లు వ్యాపారాన్ని విస్తృతం చేస్తారు. 

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులు కూడా పుట్టుకతోనే కుబేరుడి ప్రత్యేక కటాక్షాన్ని కలిగి ఉంటారు. అందుకే జీవితంలో దేనికీ ఎప్పుడూ లోటుండదు. ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్య తలెత్తదు. జీవితం ఆనందంగా సాగుతుంటుంది. తక్కువ వయస్సులోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవడం లేదా పెద్దఎత్తున సంపాదించడం ఉంటుంది. చాలా తక్కువ కాలంలో కోటీశ్వరులుగా మారిపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితంలో రాజుల్లా బతుకుతారు. 

Also Read: June Horoscope 2023: సూర్య, బుధ, శని గ్రహాల గోచారం ప్రభావం, 4 రాశులకు పెరిగిపోనున్న బ్యాంక్ బ్యాలెన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News